VI:18 వేల కోట్లతో వోడాఫోన్ ఐడియా FPO.. ఈ షేర్లు కొంటే లాభమేనా..? ప్రముఖ టెలికాం సంస్థ అయిన వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ (FPO) ప్రారంభించబోతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. By Durga Rao 18 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vodafone Idea FPO: ప్రముఖ టెలికాం సంస్థ అయిన వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ప్రారంభించబోతోంది. ఏప్రిల్ 18న అనగా రేపు సబ్ స్క్రిప్షన్ కోసం ఈ FPO ఓపెన్ కానుంది. ఏప్రిల్ 22 వరకు వోడాఫోన్ ఐడియా FPO అందుబాటులో ఉండనుంది. ఈ ఎఫ్‌పీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ. 18,000 కోట్లను సమీకరించాలని కంపెనీ టార్గెట్ పెట్టుకుంది. ఇది విజయవంతమైతే, ఇది భారతదేశపు అతిపెద్ద FPO అవుతుంది. ఈ FPOలో ఒక్కో ఈక్విటీ షేరు ప్రైస్ బ్యాండ్ రూ. 10 నుంచి రూ. 11గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో పాల్గొనే ఇన్వెస్టర్లు కనీసం 1298 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే సుమారుగా రూ. 14,278 పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్టర్లకు అలాట్ అయిన ఈక్విటీ షేర్లు ఏప్రిల్ 25న NSE, BSEలలో లిస్ట్ అవుతాయి. Also Read: పిల్లల్ని సంతోషంగా ఉంచాలంటే తల్లిదండ్రులు ఈ పనులు చేయాలి ఈ FPO ద్వారా వచ్చిన మొత్తం సొమ్ములో కొత్త 4G సైట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా తన నెట్‌వర్క్ అవస్థాపన విస్తరణ కోసం, పరికరాల కొనుగోలు కోసం రూ. 12,750 కోట్లను ఉపయోగించాలని టెల్కో ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న 4G సైట్‌ల సామర్థ్యాన్ని విస్తరించడం, కొత్త 5G సైట్‌లను ఏర్పాటు చేయడం కోసం ఈ ఫండ్ వాడతారు. ఎఫ్‌పిఓ ద్వారా వచ్చిన రూ.2,175.31 కోట్లను టెలికాం శాఖకు, జిఎస్‌టికి, స్పెక్ట్రమ్ వాయిదా చెల్లింపుల కోసం కేటాయించారు. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. Vodafone Idea సబ్‌స్క్రైబర్ బేస్ ఆధారంగా భారతదేశంలో మూడవ-అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్. అదేవిధంగా ఒక దేశ కార్యకలాపాలలో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద సెల్యులార్ ఆపరేటర్. 2G, 3G మరియు 4G సాంకేతికతల్లో షార్ట్ మెసేజింగ్ సేవలు, డిజిటల్ సేవలతో సహా వాయిస్, డేటా, ఎంటర్‌ప్రైజ, ఇతర విలువ ఆధారిత సేవలను (VAS) కంపెనీ అందిస్తోంది. ఈ కంపెనీ FPO లాభాలు తెచ్చిపెడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. #stock-market #vodafone-idea #share-market-update #fpo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి