Pushpa 2 : హైదరాబాద్ లో మలేషియా సెట్.. 'పుష్ప 2' కోసం సుకుమార్ భారీ స్కెచ్?

New Update
Pushpa 2 : హైదరాబాద్ లో మలేషియా సెట్.. 'పుష్ప 2' కోసం సుకుమార్ భారీ స్కెచ్?

'Pushpa 2' Shooting In Hyderabad : టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'పుష్ప 2' (Pushpa 2) మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసారి పార్ట్-1 కి మించి పార్ట్-2 ను ప్లాన్ చేశారు. ఇప్పటికే 'పుష్ప 2' నుండి రిలీజైన గ్లింప్స్ వీడియో, ఫస్ట్ సింగిల్ అవుట్ ఫుట్స్ చూస్తే అది అర్థమవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ బయటికి వచ్చింది.

హైదరాబాద్ లో మలేషియా సెట్

'పుష్ప 2' షూటింగ్ ప్రస్తుతం షర వేగంగా సాగుతుంది. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ లో భాగంగా ఓ కీలక సన్నివేశం కోసం మూవీ టీమ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో ఏకంగా మలేషియా సెట్ వేసినట్లు సమాచారం. అసలైతే షూటింగ్ కోసం టీమ్ అంతా మలేషియాకే వెళ్ళాల్సింది. కానీ రిలీజ్ టైం దగ్గర పడటంతో ఆ దేశానికి వెళ్లి షూట్ చేయడం కష్టంగా ఉండటంతో ఇక్కడే భారీ సెట్ వేసినట్లు తెలిసింది.

Also Read : ఆ విషయంలో ఫెయిల్ అయ్యా.. కానీ మహేష్ తో మల్టీస్టారర్ పక్కా : సుధీర్ బాబు

ఈ మలేషియా సెట్ లో అల్లు అర్జున్ (Allu Arjun) పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట. మరోవైపు రీసెంట్ గానే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ కి ఆడియన్స్ నుండి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ పాట మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు