Sora Turbo AI: జస్ట్ కమాండ్ ఇస్తే చాలు.. వీడియో రెడీ..!

Open AI విడుదల చేసిన Sora Turbo AI, టెక్ట్స్‌ను క్షణాల్లో వీడియోగా మార్చే అద్భుతమైన టూల్. ప్రస్తుతం 'చాట్ జీపీటీ' ప్లస్, ప్రో యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ టూల్ భారతదేశం, కెనడా, జపాన్ వంటి దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది.

author-image
By Lok Prakash
New Update
sora turbo ai

sora turbo ai

Sora Turbo AI: ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి చోటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముచ్చటే. ఏది చేయాలన్నా, ఒక కమాండ్‌ ఇస్తే చాలు వెంటనే AI కావలసిన కంటెంట్‌ అందిస్తోంది. తాజాగా, OpenAI Sora Turbo అనే కొత్త AI టూల్‌ను విడుదల చేసింది. ఇది కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో జనరేటర్‌. సామ్ ఆల్ట్‌మెన్ ఈ కొత్త AI మోడల్‌ను పబ్లిక్‌కు పరిచయం చేసారు.

Also Read: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా

ఈ సోరా టర్బో చాలా స్పెషల్. ఎందుకంటే ఇది టెక్ట్స్‌ను వీడియోగా మార్చే సరికొత్త ఫీచర్‌ను అందిస్తోంది. దీనికి ఒక చిన్నకమాండ్ ఇస్తే, క్షణాల్లో విజువల్స్‌ రూపంలో వీడియోగా మార్చేస్తుంది. అలాగే, ఏదైనా ఫోటోలు, వీడియో క్లిప్స్‌ ఆధారంగా కూడా కొత్త వీడియోలను సృష్టించగలదు.

Also Read: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

'చాట్ జీపీటీ' ప్లస్, ప్రో యూజర్లకు మాత్రమే..

ఈ AI మోడల్, ChatGPT Plus, ChatGPT Pro యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. సోరా టర్బో టూల్ ద్వారా 20 సెకన్ల 1080 పిక్సెల్ వీడియోలను క్షణాల్లో చేయొచ్చు.

Also Read:  మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..!

ప్రస్తుతం, ఈ టూల్ భారతదేశం, కెనడా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ AI టూల్‌ను ట్రై చేసేయండి!

Also Read:  'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు