కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...

మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్‌లో సందీప్‌ అనే వ్యక్తి కుక్కల నుంచి తప్పించుకోబోయి బావిలో పడ్డాడు. బావి లోతుగా ఉండటంతో అతడి కేకలు ఎవరికీ వినిపించలేదు. దీంతో 3రోజుల పాటు సందీప్ బావిలోనే ఉన్నాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న పిల్లల కంట పడడంతో.. అతడిని బయటకు తీశారు.

New Update
Maharashtra incident a man felldown in well

Maharashtra incident a man felldown in well

పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్లు.. కుక్కల నుంచి తప్పించుకోబోయి బావిలోపడ్డాడు ఓ వ్యక్తి.  చుట్టూ నిర్మానుష్యమైన ప్రాంతం, బావి లోతుగా  ఉండడంతో అతడి కేకలు ఎవరికీ వినపించలేదు. 3 రోజుల బిక్కు బిక్కుమంటు బావిలోనే ఉండిపోయాడు. అందులోనే మూడు రోజులు గడిపి చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విస్తుపోయే ఘటన మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

3 రోజులు బావిలోనే 

సందీప్ (32) అనే వ్యక్తి పిశోర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. అయితే సందీప్ గ్రామానికి చేరుకోగానే అతడిని కుక్కలు వెంబడించడం మొదలుపెట్టాయి. భయంతో పరుగులు పెట్టిన సందీప్ ఓ చోట బావిలో పడిపోయాడు. బావి లోతుగా ఉండడం, చుట్టూ నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో సందీప్ కేకలు ఎవరికీ వినిపించలేదు. దీంతో 3 రోజుల పాటు క్కు బిక్కుమంటు బావిలోనే గడిపాడు. అదృష్టవశాత్తు ఆడుకుంటూ అటుగా వెళ్లిన కొంతమంది పిల్లలు ఈ విషయాన్ని గమనించారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించగా.. పోలీసుల సహాయంతో సందీప్ ని బయటకు తీశారు.

telugu-news | latest-news | maharashtra-incident 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment