🔴 LIVE BREAKINGS: ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. 65 రోజుల్లో 74 మ్యాచులు!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 16, 2025 20:48 IST

    రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్

    రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడు.

    bandi with rahul gandhi
    bandi with rahul gandhi Photograph: (bandi with rahul gandhi)

     



  • Feb 16, 2025 19:00 IST

    ఐపీఎల్ 2025 షెడ్యూల్ రిలీజ్.. 65 రోజుల్లో 74 మ్యాచులు!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్‌ 2025 సీజన్‌ అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి.

    ipl sehdual 2



  • Feb 16, 2025 15:58 IST

    వైసీపీ కీలక నేత మృతి.. జగన్ దిగ్భ్రాంతి!

    ఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.  సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.

    YS Jagan Condolence



  • Feb 16, 2025 15:31 IST

    యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు తీవ్ర గాయం? సెలక్టర్లకు మరో తలనొప్పి!

    యశస్వి జైస్వాల్‌ ఎడమ చీలమండకు తీవ్ర గాయం అయింది. దీంతో సోమవారం జరగనున్న రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ నుంచి అతడు తప్పుకున్నాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యశస్విని నాన్‌ ట్రావెల్‌ రిజర్వ్‌గా పక్కన పెట్టారు. ఇప్పుడు మరొకరిని తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.

    yashasvi Jaiswal set to miss Ranji semis
    yashasvi Jaiswal set to miss Ranji semis Photograph: (yashasvi Jaiswal set to miss Ranji semis)

     



  • Feb 16, 2025 15:29 IST

    ఏపీలో దారుణం.. కూతురు వరుసయ్యే మహిళను ప్రెగ్నెంట్ చేసి.. !

    విశాఖలో ఓ మానవమృగం కీచకపర్వం వెలుగుచూసింది. వరుసకు కూతురయ్యే మహిళపై అనేక ఏళ్లుగా లైంగికదాడి చేస్తూ గర్భవతినిచేశాడు పెబ్బిలి రవికుమార్ అనే వ్యక్తి. ఆ మహిళ ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    UP Crime : పంచాయతీ పెద్దల అరాచకం.. వివాహితను చెట్టుకు కట్టేసి.. చెప్పుల దండ మెడలో వేసి!



  • Feb 16, 2025 14:54 IST

    అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

    అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు MK-84 బాంబులు చేరుకున్నాయి. 2000 ఫౌండ్ల MK-84 బాంబులు శనివారం రాత్రి ఇజ్రాయిల్‌లోని అష్డోడ్ ఓడరేవుకు చేరుకున్నాయి. వీటిని ఇజ్రాయిల్ సైన్యం వైమానిక స్థావరాలకు తరలిస్తోంది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం మొదలైంది.

    MK -84
    MK -84 Photograph: (MK -84)

     



  • Feb 16, 2025 14:53 IST

    గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!

    మధ్యప్రదేశ్ శియోపూర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో వరుడు మృతి చెందాడు. 25 ఏళ్ల వరుడు ప్రదీప్ పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డ్యాన్స్ చేశాడు. ఆపై మండపానికి వెళ్లేందుకు గుర్రంపైకి ఎక్కాడు. కాసేపటికే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు.

    Groom Dies Of Heart Attack During Wedding Procession In Sheopur
    Groom Dies Of Heart Attack During Wedding Procession In Sheopur Photograph: (Groom Dies Of Heart Attack During Wedding Procession In Sheopur)

     



  • Feb 16, 2025 14:52 IST

    ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

    పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. పసిడి కొనుగోలుకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు దిగిరావడంతో దేశీయంగానూ తగ్గాయి

    Gold rates today
    Gold rates today

     



  • Feb 16, 2025 14:51 IST

    భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు.. ఫస్ట్ ప్లేస్ లో మియాపూర్ ఏరియా.. సిటీలో టాప్ టెన్ ప్లేసుల లిస్ట్ ఇదే!

    ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ ల డేటాను పోలీసులు విడుదల చేశారు. ఇందులో మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో మొత్తం 38 కేసులు నమోదు కాగా.. బాలా నగర్ లో 37, రాజేంద్ర నగర్ లో 30 నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడండి.

    Drunk and drive cases in Hyderabad
    Drunk and drive cases in Hyderabad

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు