/rtv/media/media_files/2026/03/28/ipl-2026-rcb-vs-srh-2026-03-28-07-37-33.jpg)
IPL 2026 RCB vs SRH
- Mar 28, 2026 19:34 IST
RCB vs SRH: మ్యాచ్ ఆరంభం.. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్
- మ్యాచ్ ప్రారంభమైంది.. క్రీజులోకి వచ్చిన అభిషేక్, హెడ్
- బౌలింగ్ అటాక్ ప్రారంభించిన భువనేశ్వర్ కుమార్
- అంతకుముందు క్రికెటర్లు, అభిమానులు గత సీజన్‌లో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు
- అనంతరం జాతీయ గీతం ఆలపించారు
- Mar 28, 2026 19:31 IST
RCB vs SRH: ఇరు జట్ల ఇంపాక్ట్ సబ్‌సిట్యూట్‌లు వీరే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెథెల్, సలామ్ దార్, కాన్షిక్ చౌహాన్, వెంకటేశ్ అయ్యర్
సన్ రైజర్స్ హైదరాబాద్:శివాంగ్ కుమార్, లివింగ్‌స్టోన్, డేవిడ్ పేన్, సమ్రాన్ రవిచంద్రన్, సాకిబ్ హుస్సేన్
- Mar 28, 2026 19:17 IST
RCB vs SRH: ఇరు జట్ల తుది జాబితా ఇదే..
- సన్ రైజర్స్ హైదరాబాద్:అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాశ్ శర్మ
- Mar 28, 2026 19:16 IST
RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు
- Mar 28, 2026 19:16 IST
ఇషాన్‌కు తొలి సవాల్.. వీటిని అధిగమిస్తాడా..?
శనివారమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు VS సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు.. ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్ ఇదే. అందుకు వేదిక బెంగళూరు. నూతన సారథి ఇషాన్ కిషన్ నాయకత్వంలో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది.
- Mar 28, 2026 19:16 IST
మాంచి ఆకలిపై విరాట్.. రోహిత్‌ని కుర్రాడిలా ఉన్నావన్న నీతా అంబానీ
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు మాత్రమే మిగిలిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ సాధన ముమ్మరం చేశాడు. అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్న రోహిత్‌ను నీతా అంబానీ గుర్తు పట్టలేకపోయారట.. పృథ్వీ షాను ఓపెనర్‌గా ఆడించాలని సూచించిన ఇర్ఫాన్ పఠాన్..
- Mar 28, 2026 19:15 IST
ఐపీఎల్.. వచ్చేసింది మెరుపుల మేళా
ఐపీఎల్ 19వ సీజన్‌కు వేళైంది. అసలు సిసలు టీ20 మజాను అందించేందుకు పది జట్లు సై అంటున్నాయి. శనివారం బెంగళూరు-సన్‌రైజర్స్ మ్యాచ్‌తో లీగ్ ఆరంభం కాబోతోంది. పదేళ్ల ముందు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్, రెండో కప్పు గెలవాలని పట్టుదలతో ఉండగా.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిరుడు ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ, ట్రోఫీని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
- Mar 28, 2026 19:15 IST
ఈ ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్‌కు గుర్తుండిపోయే రాత్రి అవుతుంది: అశ్విన్
బౌండరీ హద్దులపరంగా చిన్నస్వామి స్టేడియం చిన్నదే. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌కు అదే ఆతిథ్యం ఇస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో హార్డ్ హిట్టర్లకు కొదవేంలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం సన్‌రైజర్స్ తరఫున హెన్రిచ్ క్లాసెన్, ఆర్సీబీకి జాకబ్ బెతెల్ ఆటే హైలైట్‌గా నిలుస్తుందని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు.
- Mar 28, 2026 19:15 IST
ఐపీఎల్ 2026 తొలి పోరు.. ఆధిపత్యం బ్యాటుదా? బంతిదా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌తో 19వ ఎడిషన్‌కు కర్టన్‌రైజ్ అవుతోంది. రాత్రి 7 గంటలకు టాస్ వేస్తారు. 7.30 గంటల నుంచి (IPL 2026 Match Time) ఆట మొదలవుతుంది.
- Mar 28, 2026 19:14 IST
సన్‌రైజర్స్‌పై నో ఎఫెక్ట్.. అతడు భారత్‌కు రావడంలేదుగా: మాజీ కెప్టెన్
ఐపీఎల్ 2026 సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో 19వ ఎడిషన్ మొదలుకానుంది. ఇప్పుడు సన్‌రైజర్స్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోన్న అంశం.. అబ్రార్ అహ్మద్. ఇతడిని ది హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసింది. దీంతో తీవ్ర స్థాయిలో సన్‌గ్రూప్‌పై వ్యతిరేకత వచ్చింది.
- Mar 28, 2026 19:10 IST
RCB vs SRH : టాస్ గెలిచిన బెంగళూరు... సన్‌రైజర్స్ బ్యాటింగ్!

Follow Us
/filters:format(webp)/rtv/media/media_files/2026/03/28/rcb-2026-03-28-19-08-19.jpg)