Hyderabad : లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మారేడ్ పల్లి శ్మశానవాటికలో నందిత అంత్యక్రియలు జరగనున్నాయి. By Manogna alamuru 23 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA Lasya Nanditha : బీఆర్ఎస్(BRS) ఎమ్మల్యే లాస్య నందిత(Lasya Nanditha) పార్థివ దేహం ఇంటికి చేరుకుంది. ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అదేశాలు జారీ చేశారు. మారేడ్ పల్లి స్మశాన వాటికలో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు జరుగుతాయని.. ఈరోజు సాయంత్రం లోపు లాస్య నందిత అంత్యక్రియలు పూర్తి అవుతాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి సాయన్న(Sayanna) అంత్య క్రియలు జరిగిన స్మశాన వాటికలోనే లాస్య నందిత అంత్యక్రియలు కూడా జరుపతామని చెప్పారు. లాస్య ఇంటికి నేతలు.. లాస్య నందిత ఇంటికి నేతలు వరుసగా వస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha), మాజీ మంత్రి హరీష్ రావు(Ex. Minister Harish Rao) లు లాస్య ఇంటికి చేరుకున్నారు. ఆమె కుటుంబసభ్యులను కవిత ఓదారుస్తున్నారు. మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ కూడా లాస్య ఇంటికి వెళ్ళనున్నారు. లాస్య భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. అలాగే మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే లాస్య కుటుంబసభ్యలను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిలు కూడా లాస్య ఇంటికి చేరుకున్నారు. మరోవైపు లాస్య నందిత ఇంటి వద్దకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో లాస్య ఇంటి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. లాస్య నందిత ఇంటికి చుట్టు పక్కల రోడ్లు క్లోజ్ చేశారు. Also Read : America : హైపోథర్మియాతోనే చనిపోయాడు..భారత విద్యార్ధి మృతికి కారణాలు #hyderabad #funeral #dead-body #brs-mla #lasya-naditha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి