Lagadapati: నేను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను: లగడపాటి రాజగోపాల్‌

ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్‌ మరోసారి చర్చనీయాంశమయ్యారు. లగడపాటి మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఇద్దరు కలిసి మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలయిక ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

New Update
Lagadapati: నేను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయను: లగడపాటి రాజగోపాల్‌

AP Elwctions: మరో మూడు నెలల్లో ఏపీలో (AP) అసెంబ్లీ ఎన్నికలు (Elections) రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయ వర్గాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా వేరు పడిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిన లగడపాటి రాజగోపాల్‌ (Lagadapati Rajgopal) ఇప్పుడు ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు.

సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో..అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ (EX MP GV HarshaKumar) ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్‌ రాజకీయాల్లోకి రావడంతోనే మిగిలిన నేతలు కూడా పార్టీలో యాక్టివ్‌ అయినట్లు కనిపిస్తుంది. తాజా రాజకీయాల గురించి లగడపాటి , హర్షకుమార్‌ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఉత్సాహం...

లగడపాటి, హర్షకుమార్‌ ఇద్దరు కలిసి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. వీరు ముగ్గురు కలవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లగడపాటి సుమారు పది సంవత్సరాలలో చాలా తక్కువగా మీడియాలో కనిపించారు. ఇప్పుడు వైఎస్‌ షర్మిల చేరిన తరువాత మళ్లీ నాయకుల్లో కొత్త ఉత్సాహం మొదలైందని చెప్పవచ్చు.

రాజకీయాల్లోకి రావడం లేదు..

లగడపాటి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు నేతల్లో ఊహాగానాలు మొలయ్యాయి. ఈ క్రమంలోనే లగడపాటి తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చి చెప్పారు. కాకినాడలో శుభకార్యానికి వెళ్తూ మార్గమధ్యలో హర్షకుమార్‌, ఉండవల్లిని కలిసినట్లుగా లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు.

ఏపీని విభజించడం గురించి కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాలను తాము పూర్తిగా విభేధించినట్లు లగడపాటి తెలిపారు. కేవలం ప్రజల కోసమే తన రాజకీయ భవిష్యత్తును కూడా విడిచిపెట్టినట్లు ఆయన వివరించారు. మళ్లీ రాజకీయాల్లోకి రానని..ఉండవల్లికి, హర్షకుమార్‌ కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

వీరిద్దరూ ఎక్కడ నుంచి పోటీ చేసినా సరే వారి తరుఫున ప్రచారం చేస్తానని అన్నారు. ఇంతకు ముందు అంటే జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి విపరీతమైన పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే విపరీతమైన పోటీ ఉంది. నాకు రాజకీయంగా పుట్టుకనిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని లడగపాటి అన్నారు.

Also read: వందల మంది ఉద్యోగుల పై ఫ్లిప్‌కార్ట్‌ వేటు!

Advertisment
Advertisment
తాజా కథనాలు