YSRCP : కర్నూలు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

కర్నూలలో ఈ రోజు జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో మరో సారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.

New Update
YSRCP : కర్నూలు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Kurnool : వైసీపీలో(Kurnool YCP) మరో సారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ రోజు కర్నూలులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు బహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నుండి వచ్చిన నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత మొదటి నుండి వైసీపీ కోసం కష్టపడ్డ నాయకులకు లేదని కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ రాయలసీమ కో-ఆర్దినేటర్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు, కార్పొరేటర్లు ఒకరినొకరు దూషించుకున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో పార్టీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకోవడం చర్చ నీయాంశమైంది. 2014లో వైసీపీ(YCP) నుంచి మోహన్ రెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. అయితే.. అనంతరం ఎన్నికల ముందు మళ్లీ వైసీపీలో చేరారు.  ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన హఫీజ్ ఖాన్ విజయం సాధించారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు మదలై.. క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అయితే.. 2024 ఎన్నికల్లో జగన్ ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తారన్నది జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు