KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!

కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెట్టిందని కేటీఆర్ అన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లెక్కలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. పేదరిక నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలవటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

New Update
KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!

Telangana : కేసీఆర్ (KCR) గారి హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి లో పరుగులు పెట్టిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇందుకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) లెక్కలే నిదర్శనమని చెప్పారు. పదేళ్ల పాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. తెలంగాణ మోడల్ సాధించిన ఘన విజయాలను కేంద్ర సంస్థలు ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పేదరికలో నిర్మూలనలో రెండో స్థానం..
ఇక పేదరికలో నిర్మూలనలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందన్న నీతి ఆయోగ్ (Niti Aayog) నివేదిక పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2020-21తో పోలిస్తే 2023-24 లో నాటికి (ఎస్‌డీజీ) లో 74 స్కోర్‌తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకుముదు 2020-21 తో పోల్చితే ఐదు పాయింట్లు మెరుగైందన్నారు. చాలా రంగాల్లో తెలంగాణ సాధించిన మార్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమన్నారు. తక్కువ ధరలో క్లీన్ ఎనర్జీని అందించటంలో తెలంగాణ 100/100 మార్కులు తెచ్చుకోవటం విశేషం. స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో 90/100 స్కోర్ చేసింది. అభివృద్ధి, ఆర్థిక వృద్ధిలోనూ 84/100 స్కోరు సాధించటం సంతోషాన్నిచ్చిందన్నారు.

అలాగే గత పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్ చేసేందుకు కృషి చేశారన్నారు. ఆయన విజన్, సాహోసేపేతమైన నిర్ణయాల కారణంగానే అత్యంత వేగంగా తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మెరుగైన స్థితికి చేర్చిందని ఈ ప్రభుత్వం కూడా ఆ స్ఫూర్తిని కొనసాగించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై పెట్టే దృష్టి రాష్ట్రాభివృద్ధిపై పెడితే ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు.

Also Read : అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్.. ఎందుకంటే ?

Advertisment
Advertisment
తాజా కథనాలు