మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదంటూ..రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్!

అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ సెటైర్. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో తీవ్ర నిరాశలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం..ఈ మధ్యే మంత్రి హరీశ్ రావును కలిసిన రాజాసింగ్...

New Update
మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదంటూ..రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్!

KTR Countered Rajasingh: అసెంబ్లీలో సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రశ్నోత్తరాల సమయంలో రాజాసింగ్ ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎస్ఆర్ డీపీ పనులకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్న క్రమంలో..కేటీఆర్ మాట్లాడుతూ.. రాజాసింగ్ ను అసలు మీరు బీజేపీ ఎమ్మెల్యేనే(BJP MLA) కాదని.. ఆ విషయం మీకు తెలియదేమోనని సైటైర్ వేశారు.

అయితే నిన్న బీఏసీ సమావేశం జరిగిందని బీజేపీ పార్టీ నాయకుడు ఒకరు నెల రోజుల పాటు సభ నిర్వహించాలని లేఖ రాస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమో 20 రోజులు సభ జరపాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తీరా చూస్తే.. ప్రశ్నోత్తరాల సమయంలో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ సభలో ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మాత్రమే ఉన్నారని ఆయన విమర్శించారు.

ఇక దీనికి రియాక్ట్ అవుతూ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాను కూడా సభలోనే ఉన్నానని అన్నారు. వెంటనే అందుకున్న కేటీఆర్ మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు.. మీరు ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని సెటైర్ వేశారు. 30 నిమిషాల పాటు సభలో కూర్చోలేని కాంగ్రెస్(Congress), బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ, చిత్తశుద్ధి అన్నీ తెలుస్తున్నాయని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

బయట మాత్రం కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని అన్నారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ ఇంకా సస్పెన్షన్ ను ఎత్తివేయలేదు. ఏడాది గడిచిపోయినా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా  ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాని ఫలించలేదు. కొన్ని సార్లు విజయశాంతి కూడా ట్వీట్ రూపంలో ఈ విషయంలో హైకమాండ్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కాని అధిష్టానం మాత్రం రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తేసే విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆయన పార్టీ మారుతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆయన మంత్రి హరీశ్ రావును కలిసిన నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో జంప్ అవ్వడం ఖాయమని ప్రచారం సాగింది. అయితే రాజాసింగ్ మాత్రం తాను ఉన్నంత కాలం బీజేపీలోనే ఉంటానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని చెబుతూ వస్తున్నారు. మరి త్వరలోనే ఎన్నికల రానున్న సమయంలో ఇప్పుడైనా అధిష్టానం ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేస్తుందో లేదో.. అదే విధంగా మళ్లీ గోషామహల్ టికెట్ ఇస్తుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: నిన్న వాళ్లిద్దరు కౌగిలించుకున్నారు. ఈ రోజు ఆయన ఛాంబర్ కు ఈయన..ఏంటీ మ్యాటర్..టెన్షన్ లో కమలనాథులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు