KTR - Revanth Reddy : సత్తా, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని చేయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. మిగిలిన 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు.

New Update
KTR - Revanth Reddy : సత్తా, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పని చేయ్.. రేవంత్ కు కేటీఆర్ సవాల్

KTR Challenged To CM Revanth Reddy : నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు పొందిన రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ రోజు కేటీఆర్ మాట్లాడుతూ.. మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తోందన్నారు. 8 నెలల్లో ఇప్పటి దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government), మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని వదిలిపెట్టమని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. క్షేత్రంలో నిలదీస్తామని.. విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామన్నారు.

ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని.. లక్షలాది మంది యువతకు సంబంధించిన అంశమన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కండకావరం తో మాట్లాడడం రేవంత్ రెడ్డి ఇకనైనా ఆపాలన్నారు. రేవంత్ నిరుద్యోగులు విద్యార్థులపై చేసిన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ పరీక్ష రాశారని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో దీక్ష చేశారో చెప్పాలన్నారు.

అశోక్ నగర్ లోని విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్... మీరు సన్నాసులా? రాహుల్ గాంధీ సన్నాసులా? అనే విషయం చెప్పాలన్నారు. అశోక్ నగర్ లో.. యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతున్న అంశం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ పై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లపై వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

Also Read : మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.

New Update
danam nagender brs

danam nagender brs

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  ఎప్పటినుండో కేసీఆర్‌ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని..   సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు.  హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.  

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

వ్యక్తిగతంగా బాధించింది

అయితే  రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు.  కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.  ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్  తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment