Telangana: సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. By B Aravind 27 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే కారణంతోనే ఆ పార్టీలో చేరానని అన్నారు. అయితే ఈ చర్యలు లేకపోవడం వల్లే బీజేపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కూడా తాను అనుకున్న లక్ష్యం మాత్రం నెరవలేదని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రంలో హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తారని.. బీజేపీకి ఓటు వేస్తే.. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లేనని అన్నారు. ప్రజలు నేను కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నారని అందుకే వచ్చానని క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ వ్యాఖ్యానించారు. Also Read: కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్.. ఇక మునుగోడు నియోజకవర్గంలో సర్వేలన్నీ కూడా నాకే అనుకూలంగా ఉన్నాయని కోమటిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఎన్నికల రోజులు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను కూడా ప్రకటించింది. ఇక రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది. ఇప్పిటికే బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే బీజేపీ కూడా అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. శుక్రవారం కేవలం ఒక్క అభ్యర్థితోనే రెండో జాబితాను విడుదల చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ మూడు పార్టీలు తమ పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి. Also Read: తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల.. తుమ్మల, పొంగులేటి పోటీపై క్లారిటీ.. #telugu-news #telangana-news #telangana-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి