Kolkata Doctor Case: నిందితుడికి ముగిసిన పాలిగ్రాఫ్ టెస్ట్.. రిపోర్టులో ఏముంది ?

కోల్‌కతా అభయ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్‌ రాయ్‌కు పాలీగ్రాఫ్‌ (లై డిటెక్టర్‌) పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు కూడా టెస్టులు జరిగాయి. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

New Update
Kolkata Doctor Case: నిందితుడికి ముగిసిన పాలిగ్రాఫ్ టెస్ట్.. రిపోర్టులో ఏముంది ?

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్‌ రాయ్‌కు పాలీగ్రాఫ్‌ (లై డిటెక్టర్‌) పరీక్షలు ముగిశాయి. ఈ మేరకు అధికారులు ఆదివారం వెల్లడించారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కోల్‌కతా జైల్లో ఉన్న అతడికి అక్కడే ఈ టెస్టు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు కూడా సీబీఐ కార్యాలయంలో పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. అయితే నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

Also Read: అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

ఇదిలాఉండగా ఈ కేసులో ఆర్‌జీ కర్‌ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, అలాగే అభయ హత్యాచార జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు, మరో సివిల్ వాలంటీర్‌కు కూడా శనివారమే పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా చేరుకున్న సెంట్రల్ ఫొరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ టీమ్ ఈ పరీక్షలు జరిపింది. ప్రస్తుతం ఈ వివరాలు మీడియాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం: మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు