Virat: కోహ్లీ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమం.. క్లారిటీ ఇచ్చిన కింగ్ సోదరుడు

అమ్మ సరోజ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నందుకే విరాట్ రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడనే వార్తలను ఆయన సోదరుడు ఖండించారు. అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా ఉందన్నాడు. దయచేసి ప్రజలు, మీడియా ఎలాంటి సమాచారం లేకుండా ఆమె విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కోరాడు.

New Update
Virat: కోహ్లీ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమం.. క్లారిటీ ఇచ్చిన కింగ్ సోదరుడు

Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Kohli) వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే విరాట్ తల్లి సరోజ్ (Saroj) అనారోగ్యంతో ఉన్నారని, అందుకే కోహ్లీ ఆగమేగాలమీద ఇంటికి వెళ్లాడంటూ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు మరికొందరు మాత్రం విరాట్ భార్య, నటి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందని, డెలివరీ కోసం హాస్పిటల్ లో జాయిన్ అయినందుకే కోహ్లీ వెళ్లాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంపై స్పందించిన విరాట్ సోదరుడు క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

లీవర్ సమస్యతో..
ఈ మేరకు 'మా అమ్మ లీవర్ సమస్యతో బాధపడుతుందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. దయచేసి ప్రజలు, మీడియా.. ఎలాంటి సమాచారం లేకుండా మా అమ్మ విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు' అని కోరాడు. ఇక కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలని, మొదటి రెండు టెస్టులకు అతడు ఎందుకు తప్పుకున్నాడనే ఊహాగానాలు మానుకోవాలని బీసీసీఐ అభిమానులను, మీడియాను కోరింది.

ఇది కూడా చదవండి : Muddanur: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు.. కడపలో ఉద్రిక్తత

సమాచారం లేదు..
ఇదిలావుంటే.. చివరి మూడు టెస్ట్‌లకు ఇవాళ టీమిండియాను ప్రకటించాల్సి ఉన్నా విరాట్‌ నుంచి ఇప్పటివర​కు ఎలాంటి సమాచారం లేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. కానీ రెండో టెస్ట్ ముగిసిన తర్వాత మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల విరామం దొరుకుతుంది. ఈ లోపు కోహ్లీ జట్టులో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోహ్లీ లేకుండా హైదరాబాద్ లో ఆడిన తొలి టెస్టు లో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా వైజాగ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు