Corporate FD: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ..కార్పొరేట్ FD..వివరాలివే.. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ రిస్క్ తో ఉంటాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ తో అటువంటి రిస్క్ ఉండదు. బ్యాంకులే కాకుండా కొన్ని NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కార్పొరేట్ FD సౌకర్యాన్ని ఇస్తాయి. బ్యాంకుల కంటే ఇక్కడ వడ్డీ ఎక్కువ ఉంటుంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Corporate FD: స్టాక్ మార్కెట్ రిస్క్‌ల నుండి దూరంగా సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి FD ఉత్తమ పెట్టుబడి ఎంపిక. మార్కెట్ అస్థిరత నుండి తమ సేవింగ్స్ ను కాపాడుకోవాలనుకునే పెట్టుబడిదారులకు FD ఎప్పుడూ ఒక పెద్ద పెట్టుబడి. బ్యాంకులు, NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు), కార్పొరేట్‌లు, పోస్టాఫీసులు సామాన్యులు- సీనియర్ సిటిజన్‌ల కోసం అనేక రకాల FDలను అందిస్తాయి. కార్పొరేట్ FDలో రేటింగ్‌లు.. Corporate FD: కార్పొరేట్ ఎఫ్‌డిని ఎంచుకునేటప్పుడు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. ఇందులో ముఖ్యమైనది FD రేటింగ్. ఏదైనా FD దాని వడ్డీ రేటు, తిరిగి చెల్లించే సౌకర్యం మొదలైన వాటి ఆధారంగా రేటింగ్ ఇస్తారు. అధిక రేటింగ్, FD సురక్షితంగా ఉంటుంది. CRISIL, ICRA - ఇతర రేటింగ్ ఏజెన్సీలు ఈ కార్పొరేట్‌ల గురించి సవివరమైన సమాచారాన్ని పొందిన తర్వాత FDలకు రేటింగ్‌లు ఇస్తాయి.. Also Read: స్టాక్ మార్కెట్ జూన్ 4 తరువాత పరుగులు తీస్తుందంటున్న పీఎం మోదీ ఈ FDలు టాప్ రేటింగ్‌లను కలిగి ఉన్నాయి Corporate FD: NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందించే FD పథకాలను కార్పొరేట్ FD లేదా కంపెనీ FD అని కూడా అంటారు. paisabazaar.com ద్వారా వచ్చిన డేటా ఆధారంగా, రేటింగ్‌ల ప్రకారం AAA లేదా AA+ అధిక రేటింగ్‌లు కలిగిన టాప్ 5 కార్పొరేట్ FDల గురించి ఇప్పుడు మనం చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ Corporate FD: బజాజ్ ఫైనాన్స్ 12 నెలల నుండి 60 నెలల కాల వ్యవధిలో 7.4 శాతం నుండి 8.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రేటింగ్: CRISIL-AAA/స్టేబుల్ ICRA-AAA/స్టేబుల్ మహీంద్రా ఫైనాన్స్ Corporate FD: మహీంద్రా ఫైనాన్స్ 12 నెలల నుండి 60 నెలల వరకు 7.6 శాతం నుండి 8.05 శాతం వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. రేటింగ్‌లు: CRISIL-AAA/స్టేబుల్ ICRA-AAA/స్టేబుల్ సుందరం హోమ్ ఫైనాన్స్ సుదర్శన్ హోమ్ ఫైనాన్స్ 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు 7.9 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఇది సీనియర్ సిటిజన్లకు 30 bps వరకు అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. రేటింగ్‌లు: CRISIL-AAA/స్టేబుల్ ICRA-AAA/స్టేబుల్ LIC హౌసింగ్ ఫైనాన్స్ Corporate FD: LIC హౌసింగ్ ఫైనాన్స్ 5 సంవత్సరాల వరకు 7.25 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది, సీనియర్ సిటిజన్లు 25 bps అదనపు వడ్డీ రేటును పొందుతున్నారు. రేటింగ్‌లు: CRISIL-AAA/స్టేబుల్ ICICI హోమ్ ఫైనాన్స్ Corporate FD: ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ సాధారణ కస్టమర్లకు 60 నెలల వరకు 7.25 శాతం నుండి 7.6 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. #investments #corpoorate-fd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి