Kishan Reddy: హోంగార్డ్ రవీందర్‌ను పరామర్శించిన కిషన్ రెడ్డి హోంగార్డు రవీందర్‌ను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హొంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నంకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్ చేశారు. By Karthik 07 Sep 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి ఆత్మహత్యయత్నం చేసుకున్న హోంగార్డు రవీందర్‌ను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరామర్శించారు. కంచన్ బాగ్‌లోని అపోలో ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రి.. చికిత్స పొందుతున్న రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రవీందర్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మహత్య ఘటనకు పూర్తి బాధ్యత కేసీఆరే వహించాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డులు అవమానాలు ఎదుర్కొని, పై అధికారులు చీదరించుకుంటున్నా భరిస్తూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జీతం సమయానికి రాకపోవడం, ఇంట్లో సమస్యలు ఎక్కువ కావడంతో ఏం చేయాలో తోచక హోంగార్డులు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ 2017లో అసెంబ్లీ సాక్షిగా హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఆయన చేసిన ప్రకటన ప్రకటనగానే ఉండిపోయిందని మండిపడ్డారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని హోంగార్డులు గత 2 నెలలుగా మంత్రుల క్యాంపు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. మంత్రులు పట్టించుకోలేదన్నారు. తమ గోడు చెప్పుకుందామని హోంగార్డులు ఎన్నిసార్లు ప్రయత్నించినా మంత్రులు కానీ బీఆర్‌ఎస్ పెద్దలు కానీ హోంగార్డులను దగ్గరికి రానివ్వలేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు హోంగార్డుల పరిస్థితి రోజువారీ కూలీల్లా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వేల మంది హోంగార్డులు ఉన్నారన్న కిషన్ రెడ్డి.. ప్రభుత్వం వారికి 27 వేల రూపాయలే అందిస్తోందన్నారు. వారు ఏదైనా కారణాలతో విధుల్లోకి రాకపోతే వారి జీతం నుంచి 900 రూపాయలను కట్ చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు సంవత్సవరానికి వంద రోజుల అలవెన్స్ కింద 20 వేలు రూపాయలు ఇవ్వాలన్న ఆయన.. కానీ బీఆర్‌ఎస్ సర్కార్ యూనిఫాం అలవెన్స్ కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. 40 ఏళ్లు హోంగార్డుగా విధులు నిర్వహించి రిటైర్మెంట్ తీసుకున్న వారికి శాలువా కప్పి బోకేతో పంపిస్తున్నారని, తర్వాత వారికి ఫించన్ సదుపాయం కల్పిండంలేదన్నారు. #brs #kcr #bjp #kishan-reddy #home-guard #ravinder #parimarsha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి