Kim Jong Un : వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణ శిక్ష!

వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం రావడానికి కారణమయ్యారనే కారణంతో వారికి మరణ శిక్ష విధించినట్లు సమాచారం.

New Update
Kim Jong Un : వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణ శిక్ష!

North Korea: నార్త్ కొరియాను గత నెలలో వరదలను ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాలు వరదల వల్ల నీట మునిగాయి. సుమారు 4 వేల మంది చనిపోయారని, 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారని ఆ దేశ అధికారిక మీడియా సంస్థ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు.

వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం రావడానికి కారణమయ్యారనే కారణంతో వారికి మరణ శిక్ష విధించినట్లు తాజాగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.

వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బోటు మీద పర్యటించారు. ముందు మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు.

వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు. ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ ఛాగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి సహా మొత్తం 30 మంది ఉన్నతాధికారులకు కిమ్ మరణ శిక్ష విధించారని, గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Also Read: శ్రీశైలం పవర్‌ హౌస్‌లో పేలుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు