Mumbai Indians: రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్‌ పోస్ట్.. అంబానీ మావకు ఇచ్చి పడేశాడుగా!

వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుందని.. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుందంటూ పొలార్డ్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. ఇది అంబానీ ఫ్రాంచైజీకి చురకలంటించినట్టే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

New Update
Mumbai Indians: రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్‌ పోస్ట్.. అంబానీ మావకు ఇచ్చి పడేశాడుగా!

2024 ఐపీఎల్‌(IPL) సీజన్‌కు జరిగిన మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ తీసుకున్న ఓ నిర్ణయం రోహిత్‌(Rohit Sharma) అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. రానున్న సీజన్‌కు కెప్టెన్‌గా రోహిత్‌ని కాకుండా గుజరాత్‌ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya)ను నియమించడం పట్ల హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కొంతమంది ఏకంగా ముంబై జెర్సీలను తగలబెట్టారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అటు ఈ విషయంలో ముంబై ఇండియన్స్‌ ప్లేయర్లు సైతం అంబానీ ఫ్రాంచైజీ నిర్ణం పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో సూర్యకుమార్‌, బుమ్రా చేసిన సోషల్‌మీడియా పోస్టులు అందుకు ఎగ్జాంపూల్‌గా నిలుస్తున్నాయి. ఇదే క్రమంలో ముంబై మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్‌(Kieron Pollard) చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది.

publive-image

పొలార్డ్ ఏం అన్నాడంటే?
'వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుంది. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుంది' అంటూ పొలార్డ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ గురించేనంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఇన్‌స్టా స్టోరీ రోహిత్‌ కెప్టెన్సీ ఎపిసోడ్‌ మేటర్‌తో సింకైంది. ఇక రోహిత్‌, పొలార్డ్‌ మంచి ఫ్రెండ్స్‌ అని అందరికి తెలిసిందే. తన మాజీ సహచర ఆటగాడి కోసం పొలార్డ్ ఇలా పోస్ట్ చేసి ఉంటాడని అర్థమవుతోంది.

ముంబై ఎందికిలా చేసింది?
రానున్న 2024 ఐపీఎల్‌ సీజన్‌తో చాలా మంది ప్లేయర్ల కాంట్రెక్ట్‌ ముగుస్తుంది. 2025 సీజన్‌కు మెగా వేలం జరుగుతుంది. అంటే ఫ్రాంచైజీలు కేవలం నలుగురు ప్లేయర్లనే అంటిబెట్టుకోవాల్సి ఉంటుంది. రోహిత్ వయసు 36ఏళ్లు.. ఒకవేళ రోహిత్ జట్టులో కొనసాగినా ప్లేయర్‌గానే ఉంచుకోవాలన్నది ముంబై ప్లాన్ కావొచ్చు. ఇటు30ఏళ్ల పాండ్యా భవిష్యత్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పండితులు అభిప్రాయపడుతున్నారు. మెగా వేలంలో కొనుగోలు చేసే బదులు ఈ సీజన్‌కే ట్రేడ్‌ చేసుకోని.. తమతో పాటే 2025,2026,2027 సీజన్లకు పాండ్యాను కెప్టెన్‌గా ఉంచుకోవడం బెటర్‌ అని ముంబై ఫ్రాంచైజీ భావించినట్టు సమాచారం.

Also Read: అభిమాని చెంప చెల్లుమనిపించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌.. బుద్ధి మారదుగా.. వీడియో వైరల్!

WATCH:

#cricket #cricket-news #ipl-2024 #kieron-pollard
Advertisment
Advertisment
తాజా కథనాలు