నిన్ను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుంది.. మన్సూర్ ను పొట్టు పొట్టు తిట్టిన ఖుష్బూ త్రిషకు క్షమాపణలు చెప్పలేనన్న మన్సూర్ ను నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ పొట్టు పొట్టు తిట్టారు. ఇతరులను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తుంది. మన్సూర్ ను చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుందన్నారు. By srinivas 23 Nov 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల ఆయన వైఖరి సరిగా లేదని, ఇలాంటి వ్యక్తులు తమ ఫ్యామిలీలో ఆడవాళ్లను ఎలా చూస్తారంటూ పరోక్షంగా చురకలంటించారు. తన కూతురు వయసున్న త్రిషను కామంతో చూడటం సిగ్గుచేటు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు త్రిషకు క్షమాపణలు చెప్పలేను అనే మన్సూర్ కామెంట్స్ పై తాజాగా రియాక్ట్ అయిన ఖుష్బూ.. ‘ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్లు చేసిన తప్పులను ఎత్తి చూపించి తాము చేసిన పనులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. మన్సూర్ అలీఖాన్ ఎదుటివాళ్లను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తుంది. క్షమించండి.. ఈ వివాదం నుంచి మీరు బయటపడలేరు. క్షమాపణలు చెప్పడంతో మీరేమీ తగ్గిపోరు. కానీ, మీ ఇంట్లో ఉండే మహిళలకు గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుంది. సినిమాల్లో పోషించిన పాత్రలనే నిజ జీవితంలోనూ మీరు ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుంది'అంటూ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు నటి ఖుష్బూ. Also read :142 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అత్యాచారం.. ఆరేళ్లుగా అదే పని ఇక వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వస్తే.. విజయ్ - త్రిష కలయికలో వచ్చిన తాజా మూవీ ‘లియో’. ఇందులో మన్సూర్ సహాయనటుడిగా కనిపించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన త్రిషతో సన్నిహిత సన్నివేశంలో నటించడంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకూ నేను ఎన్నో రేప్ సీన్స్‌లో యాక్ట్ చేశా. ‘లియో’లో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ చేసే అవకాశం ఉంటుందనుకున్నా. అలా లేకపోవడం నన్నెంతో బాధించింది’ అంటూ కాంట్రవర్సీకి దారితీశారు. దీంతో త్రిష ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మన్సూర్ త్రిషకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై మళ్లీ రియాక్ట్ అయిన మన్సూర్.. తాను క్షమాపణ చెప్పాలనుకోవడం లేదనడం మరింత చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేయగా అతనిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. #trisha #mansoor-ali-khan #khushboo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి