TGPSC: టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం! గ్రూప్ 1 లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 25న రాలేని వారికి 27న మరో అవకాశం కల్పిస్తుంది. By Bhavana 23 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TGPSC: గ్రూప్ 1 లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. 25న రాలేని వారికి 27న మరో అవకాశం కల్పిస్తుంది. గ్రూప్-1 సర్వీస్‌లలో స్పోర్ట్స్ రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గుర్తింపు పొందిన ఆటలు/క్రీడలలో (ఫారమ్-1), ఒక అంతర్జాతీయ పోటీ/మల్టీ నేషనల్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు మాత్రమే గ్రూప్ – 1 పోస్టులకు క్రీడా రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేయడానికి అర్హులని టీజీపీఎస్సీ ప్రకటించింది. స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల నుండి అందిన నివేదిక ప్రకారం.. 36 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్ లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. వారి గ్రూప్-1 ఆన్‌లైన్ అప్లికేషన్‌లో గుర్తించిన క్రీడలు.. అభ్యర్థుల ఒరిజినల్ ఫారమ్-I , అన్ని ఇతర సంబంధిత స్పోర్ట్స్ సర్టిఫికేట్‌లను ప్రభుత్వ క్రీడా శాఖ అధికారుల ద్వారా ధృవీకరించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ డే 2వ తేదీ తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా పెండింగ్‌లో ఉన్న పత్రాల అంగీకారం కోసం ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబడవని కమీషన్ పేర్కొంది. ఈ క్రమంలో.. అభ్యర్థులు 25వ తేదీన ఉదయం 11 గంటలకు టీజీపీఎస్సీ కార్యాలయానికి రావాలని తెలిపింది. ఒరిజినల్ ఫాం-1, అన్ని సంబంధిత సర్టిఫికేట్లతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రావాలని టీజీపీఎస్సీ వివరించింది. Also read: టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా కమలా హ్యారిస్.. మరో చరిత్ర సృష్టించనున్న ప్రవాస భారతీయురాలు! #telangana #tgpsc #group-1 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి