Reliance AGM: చివరి 5 AGMలలో ముఖేష్ అంబానీ చేసిన కీలక ప్రకటనలివే.. మరి ఈసారి?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ ఏజీఏం(AGM)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 5ఏళ్లుగా ప్రతి ఏజీఎంలోనూ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ఈసారి 5జీ పరంగా అంబానీ ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుమూల గ్రామాల్లోకి 5జీ సేవలు వెళ్లాలని రిలయన్స్‌ జియో టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సమాచారం.

New Update
Reliance AGM: చివరి 5 AGMలలో ముఖేష్ అంబానీ చేసిన కీలక ప్రకటనలివే.. మరి ఈసారి?

Reliance AGM 2023: భారతీయ కంపెనీలలో జరిగే ఇతర షేర్‌హోల్డర్‌ల సమావేశాల లాగా కాకుండా, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) AGMకి సపరేట్‌ ఫాలోయింగ్‌ ఉంది. దీన్ని కంపెనీ ఈవెంట్‌ లాగా కాకుండా అన్ని వర్గాల వారు ఆసక్తిని చూపిస్తారు. ఎందుకంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్లాన్లు మన జీవితంలో తెలియకుండానే భాగమైపోయింది. 5జీ నుంచి మొబైల్స్‌ గ్యాడ్జెట్స్‌ వరకు రిలయన్స్‌ టచ్‌ లేకుండా ఉండని పరిస్థితులు ఉన్నాయి. అందుకే రిలయన్స్ AGM ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్‌. కంపెనీ ఛైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ RILని మరింత ముందుకు నడిపించడానికి ఏమి చేయనున్నారు..? ఏం ప్రకటనలు చేస్తారన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత ఐదు AGMలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన కీలక ప్రకటనలకు ఇక్కడ చూడండి.

రిలయన్స్ AGM, 2018:
జూలై 5న జరిగిన 2018 AGMలో, JioPhone-2 కస్టమైజ్ చేసిన వాట్సాప్‌తో ప్రారంభ ధర రూ. 2,999గా అంబానీ ప్రకటించారు. బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ లైన్ సేవలను ప్రారంభించారు. 2018 AGMలో, జియో గిగా ఫైబర్‌(JioGigaFiber) ప్రపంచంలో ఎక్కడైనా అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఫిక్స్‌డ్-లైన్ బ్రాడ్‌బ్యాండ్ రోల్‌అవుట్ అవుతుందని.. దేశంలోని 1,100 నగరాల్లో ఒకేసారి రోల్ అవుట్ జరుగుతుందని ముకేశ్ అంబానీ చెప్పారు.

రిలయన్స్ AGM, 2019:
ఆగస్ట్ 12, 2019న జరిగిన ఈ AGM పెద్ద హైలైట్ ఏంటంటే జియోఫైబర్‌(JioFiber) సేవలను ప్రారంభించడం. జియో ఫైబర్‌ను వాణిజ్యపరంగా ప్రారంభించనున్నట్లు అంబానీ ప్రకటించారు. ప్రాథమిక ప్లాన్ 100 Mbps వేగంతో ప్రారంభించారు. నెలకు రూ. 700 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమయ్యాయి. మరో పెద్ద ప్రకటన మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం. దీని కింద జియో దేశం అంతటా డేటా సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌ను తీసుకువస్తుంది.

రిలయన్స్ AGM, 2020
జూలై 15, 2020లో జరిగిన ఈ AGMలో, జియో ప్లాట్‌ఫారమ్‌లలో 7.7శాతం వాటా కోసం గూగుల్‌(Google) రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఇది కాకుండా, కంపెనీ జియో టీవీ ప్లస్, జియో గ్లాస్ మొదలైనవాటిని అభివృద్ధి చేస్తోందని జియో తెలిపింది. ఏజీఏం వద్ద, కంపెనీ జియోమార్ట్(JioMart), జియో 5జీ(Jio 5G) సొల్యూషన్‌ల వివరాలను కూడా ప్రకటించింది.

రిలయన్స్ AGM 2021
రిలయన్స్ 100 GW సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు 2021 ఏజీఏం(AGM)లో అంబానీ ప్రకటించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసే పనిని కంపెనీ ప్రారంభించింది. రిలయన్స్ తన AGM లో కొత్త ఇంధన వ్యాపారంలో రాబోయే 3 సంవత్సరాలకు 75,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా ప్రకటించింది.

రిలయన్స్ AGM, 2022:
5G నెట్‌వర్క్‌ను అమలు చేయడంలో అంబానీ రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించారు. పెట్రో కెమికల్ వ్యాపారంలో వచ్చే ఐదేళ్లకు 75,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా అంబానీ ప్రకటించారు. జియో ఫైబర్‌(Jiofiber), పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త గిగాఫ్యాక్టరీ, బ్యాటరీ ప్యాక్‌లపై ఉత్పత్తి కూడా RIL 45వ AGMలో చేసిన ప్రధాన ప్రకటనలు.

ఈసారి ఏం ప్రకటనలు ఉండొచ్చు?
ఈసారి అంబానీ ప్రకటనలు 5జీ చుట్టూనే ఉండే అవకాశాలున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ని ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు అంబానీ. 5జీ సేవలు మారుమూల గ్రామాల్లోకి వెళ్లాలని అంబానీ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు సమాచారం.

ALSO READ: రిలయన్స్‌ ఏజీఏంవైపే అందరి చూపు.. అంబానీ ఏం ఆఫర్లు ప్రకటిస్తారు?

Advertisment
Advertisment
తాజా కథనాలు