Kejriwal : కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండోసారి ఆదేశాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్కడ నుంచే తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు మళ్ళీ పరిపాలనకు సంబంధించి రెండోసారి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు ఉత్తర్వులనిచ్చారు. By Manogna alamuru 26 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kejriwal Second Order Went out From Custody : ప్రస్తుతం దేశంలో అత్యంత హాట్ టాపిక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam). ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిన ఈడీ(ED) కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. మార్చి 28 వరకు కోర్టు కేజ్రావాల్‌కు కస్టడీ విధించింది. అయితే అరెస్ట్ అయిన తర్వాత కూడా కేజ్రీవాల్ ఢిల్లీ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి ఆదేశాలను జారీ చేస్తున్నారు. అరెస్ట్ తర్వాత ఈ రోజు రెండోసారి పరిపాలనకు సంబంధించి ఆదేశాలను జారీ చేశారు కేజ్రీవాల్. అయితే ఈ విషయం కూడా చాలా చర్చనీయాంశం అవుతోంది. ఇంతకు ముందు మొదటిసారి ఇచ్చిన ఆదేశాల మీద ఈడీ దర్యాప్తు చేస్తుండగా...ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం గమనార్హంగా మారింది. ఆరోగ్యశాఖకు సంబంధించి.. ఈరోజు ఉదయం కేజ్రావాల్ లాకప్ నుంచే రెండు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖకు సంబంధించినవి అని చెబుతున్నారు. అయితే కేజ్రావాల్ ఎలా ఆదేశాలిస్తున్నారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. మొదటిసారి ఆయన నీటి సమస్య నివారణ కోసం ఆప్(AAP) మంత్రి అతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చారు. అయితే ఈదీ దీన్ని ఒప్పుకోవడం లేదు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్న టైమ్‌లో తాము కంప్యూటర్ లేదా కాగితాలను సమకూర్చలేదని చెబుతున్నారు. ఆదేవాలు ఎలా బయటకు వెళ్ళాయో దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన.. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలను చేస్తోంది. ఈరోజు ప్రధాని మోదీ(PM Modi) ఇంటి ముట్టడికి పార్టీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆప్ నేతల ముట్టడికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రధాని ఇంటి దగ్గర భారీగా బలగాలను మోహరించారు. అంతేకాదు ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను కూడా విధించారు. పీఎం నివాసానికి వెళ్ళే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. Also Read : Telangana: గోవాలో తెలంగాణ రాజకీయం #aravind-kejriwal #ed #delhi-cm #custody మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి