ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏపీ యువతి.. అయినా లక్ష్యం నెరవేరలేదట!

అంబటి కీర్తినాయుడు అనే ఏపీ యువతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ధవళేశ్వరంకు చెందిన ఆమె కస్టమ్స్‌, ఎంటీఎస్‌, రైల్వే, పోస్టల్‌, గ్రామ కార్యదర్శి, ట్యాక్స్‌ అసిస్టెంట్‌, జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌ జాబ్స్ సాధించినా సివిల్స్‌ లక్ష్యం అంటోంది.

New Update
ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏపీ యువతి.. అయినా లక్ష్యం నెరవేరలేదట!

Young Woman Got Seven Government Jobs From AP : ప్రభుత్వం ఉద్యోగమే (Government Job)లక్ష్యంగా లక్షలమంది నిరంతరం కఠోర శ్రమ చేస్తూనే ఉన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా చదువుతూ, లక్షలు ఖర్చులు పెట్టి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో ఒకటి రెండు మార్కులతో మిస్ అయినా జాబ్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కొంతమంది ఎన్నిసార్లు పరీక్షలు రాసినా సరైన గైడెన్స్ లేకపోవడంతో విఫలమవుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన ఓ యువతి ఏకంగా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. 2019 నుంచి ఇప్పటివరకూ ఏడు ఉద్యోగాలకు ఎంపికైనా తన లక్ష్యం మాత్రం నెరవేరలేదంటోంది.

ఇదికూడా చదవండి : SBIలో 5280 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు ఆ స్కిల్ ఉంటే చాలు

ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు అనే యువతి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా.. తాజాగా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సస్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా కొలువు వచ్చినట్లు బుధవారం ఆమె తండ్రి అడ్వకేట్‌ అంబటి మురళీకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లో 2019లో ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగం సాధించిన ఆమె అనంతరం కస్టమ్స్‌ విభాగంలో ట్యాక్స్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. గతేడాది మార్చిలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఇంటర్‌బేస్డ్‌ ఉద్యోగాల్లో భాగంగా ఎంటీఎస్‌ ఉద్యోగం, భారత రైల్వేలో ఉన్నతాధికారిగా, పోస్టల్‌ విజిలెన్సు విభాగంలో మరో ఉద్యోగం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ కార్యదర్శి పోస్టుకు సైతం ఎంపికయ్యారు. ఇక 2019లో డిగ్రీ పూర్తయిన వెంటనే ఆరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ కొలువులు వచ్చినా ఎప్పటికైనా సివిల్స్‌ సాధించి దేశసేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెబుతోంది కీర్తినాయుడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు