Dharmapuri Arvind: కేసీఆర్‌ను నేనే కంట్రోల్‌ చేశా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ను కంట్రోల్‌ చేసింది తానే అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్‌ విసిరారు.

New Update
Dharmapuri Arvind: కేసీఆర్‌ను నేనే కంట్రోల్‌ చేశా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Dharmapuri Arvind: బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే దొంగల కుటుంబమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌(CM KCR) తన 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సమస్యలు పెరిగాయన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఎలుకలు, కుక్కలు సైర్య విహారం చేస్తున్నాయన్న ఎంపీ.. ప్రభుత్వం ఆస్పత్రిని పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. కేసీఆర్‌ ట్యాంక్‌ బండ్‌ నీటిని శుద్ధి చేస్తామన్నారని, రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామి ఇచ్చినట్లు గుర్తు చేసిన అర్వింద్‌.. హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇచ్చినా చివరకు కోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని అర్వింద్‌ ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో వైన్స్‌ టెండర్లు పక్కదారి పడుతున్నాయన్న ఆయన.. వాటి మతలాబు ఎంటో లిక్కర్‌ రాణి కవిత చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఈ మధ్య ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడుతున్నారన్న ఎంపీ దానికి కారణం తానే అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు కట్టాలంటే హౌసింగ్‌ శాఖ ఉండాలన్నారు. మరి రాష్ట్రంలో ఆ శాఖ లేదని, అలాంటి సమయంలో ఇళ్లు ఎలా కడతారని ప్రశ్నించారు. గతంలో హౌసింగ్‌ శాఖలో ఉన్న ఉద్యోగాలు ఇతర శాఖలకు బదిలీ చేసి రాష్ట్రంలో హౌసింగ్‌ శాఖ లేకుండా చేశారన్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ.. కవిత గజ్వేల్‌లో తప్ప ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే కవిత అక్కడికి వచ్చి పోటీ చేసే దమ్ముందా అని అర్వింద్‌(Dharmapuri Arvind) సవాల్‌ చేశాడు. కవిత రాజకీయ జీవితానికి ఎండ్‌ కార్డ్‌ పడిందని ఆయన జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో తాగి పడుకుంటే ఫామ్‌హౌస్‌ లేస్తారని ఎద్దేవా చేశారు. తక్కువ కాలంలో ప్రగతి భవన్‌ను నిర్మించుకున్న కేసీఆర్‌.. రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌లను మాత్రం నిర్మించి ఇవ్వలేకపోతోన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌(BRS) సర్కార్‌ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పుకుటుందన్న ఎంపీ.. ఎకరం 100 కోట్లు పలకడం అభివృద్ధి కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అంది, వాళ్లు ప్రగతి సాధిస్తే అప్పుడు రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా ఉంటుందన్నారు. కానీ కేసీఆర్‌ సంక్షేమ ఫలాలను కొందరికే అందజేస్తున్నారని, కేసీఆర్‌ నిర్ణయాల వల్ల మధ్యతరగతి వారు నిరుపేదలుగా మారుతున్నారని అర్వింద్‌ ఆరోపించారు.

Also Read: ‘హర్ ఘర్ తిరంగా’లొ పాల్గొనండి… సెల్ఫీ అప్ లోడ్ చేయండి… ప్రజలకు మోడీ పిలుపు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు