నీతిఆయోగ్‌ మెచ్చిన తెలంగాణ వైద్యశాఖ: మంత్రి హరీశ్‌ రావు!

తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

New Update
నీతిఆయోగ్‌ మెచ్చిన తెలంగాణ వైద్యశాఖ: మంత్రి హరీశ్‌ రావు!

KCR Inaugurates Ambulance: తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) కొత్తగా 466 అత్యవసర వాహనాలను మంగళవారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు(Minister Harish Rao) ప్రసంగించారు. కొత్తగా వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడే సమయానికి లక్ష మందికి ఒక అంబులెన్స్‌ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 75 వేల మందికి ఒక అంబులెన్స్‌ ఉంది. అమ్మ ఒడి వాహనాలు కావాలని కోరగానే సీఎం కేసీఆర్‌ వెంటనే నిధులు మంజూరు చేశారు.

పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలో ఐదంచెల వ్యవస్థను కేసీఆర్‌ ఇప్పటికే ఏర్పాటు చేశారని కొనియాడారు. తెలంగాణ వైద్య శాఖను నీతి ఆయోగ్‌(Niti Ayog) సైతం అభినందించింది అని పేర్కొన్నారు . ‘కరోనానే కాదు భవిష్యత్తులో దాని తాతలాంటి మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనేలా వైద్యరంగం సిద్ధంగా ఉన్నది’ అని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొట్లాటాలు, అవినీతి ఉందని విమర్శించారు.

ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆయన వివరించారు. తెలంగాణ కుటుంబానికి పెద్దగా ఉన్న కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. చివరికి రాష్ట్రంలో ఉన్న ఆశావర్కర్ల ఫోన్‌ బిల్లులు కూడా నేటికీ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని తెలిపారు.

రానున్న రోజుల్లో వారికి స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆయన వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో స్కామ్‌లు ఉంటే.. తెలంగాణలో స్కీమ్‌లు ఉన్నాయి. అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్ చేయాలనుకుంటున్నామని తెలిపారు. 108 ఉద్యోగులకు స్లాబులుగా వేతనాల పెంపు జరుగుతుంది” అని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు