KTR: కేసీఆర్ చాలా డేంజర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ అధికారంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడంతో అధికార పార్టీకి చాలా డేంజర్ అని కేటీఆర్ అన్నారు. త్వరలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అన్నారు. సీఎం రేవంత్ ధీ ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? అని అన్నారు. By V.J Reddy 28 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు కేటీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిది ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా అని ఎద్దేవా చేశారు. ALSO READ: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో కీలక పరిణామం కరెంట్ కష్టాలు షురూ... అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణ తెచ్చింది గులాబీ జెండానే. పోయింది అధికారం మాత్రమే.. పోరాట పటిమ కాదు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు దేశంలో లేదు. రేవంత్ ది మేనేజ్‌మెంట్ కోటా.. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చురకలు అంటించారు కేటీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా..? తెలంగాణ రాకుంటే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు మీకు దక్కేవా..? రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు రోజుకో అవినీతి కథ అల్లుతున్నారు. ఇక్కడ అవినీతి.. అక్కడ అవినీతి అని కథలు చెబుతున్నారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.. అవినీతిని వెలికితీయమనే చెబుతున్నాం. అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోండి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటే వదిలిపెట్టం అని కేటీఆర్ హెచ్చరించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా నమ్మలేదు అని కేటీఆర్ తెలిపారు. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ చెప్పిందే నిజమైందని ప్రజలు భావిస్తున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అయ్యాయి. ఫ్రీ బస్సు పథకంతో బస్సుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఏదైనా పథకం తెస్తే ఆలోచించి తేవాలి. గవర్నర్ ప్రసంగం అంతా అబద్దాల పురాణం. శ్వేతపత్రం పెడితే.. ధీటుగా జవాబిచ్చాం. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటేనే పవర్ ఫుల్. కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ అయ్యాయి. సిరిసిల్ల నేతన్నలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ డేంజర్.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే ప్రతిపక్ష నేతగా ఉండడం చాలా డేంజర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీ మీద కూర్చోగానే బావ బామ్మర్దులు ఇద్దరు తనపై విమర్శల దాడికి దిగిరాని అన్నట్లు కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో ఇద్దరం మాట్లాడితేనే ఇలా ఉందంటే కేసీఆర్ సభలోకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు కేటీఆర్. DO WATCH: #ktr #kcr #cm-revanth-reddy #brs-party #congress-six-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి