Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్

అసెంబ్లీకి కేసీఆర్  గైర్హాజర్ పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన మహానుభావుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నారు. సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదు'అన్నారు.

New Update
Telangana Assembly: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్

CM Revanth Reddy Comments on KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్, (BRS) కాంగ్రెస్ (Congress) నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా నీళ్లు, ప్రాజెక్టులపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు సభలో (Telangana Assembly) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్ టార్గెట్ గ్ సంచలన కామెంట్స్ చేశారు.

ఫామ్ హౌస్ లో దాక్కున్నారు..
ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు మొదలైనా ఆ మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారంటూ కేసీఆర్ (KCR) పై రేవంత్ ఫైర్ అయ్యారు. అంతేకాదు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన ఆయన సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. అలాగే తెలంగాణకు కృష్ణా నీళ్లు ప్రాణప్రదాయమని చెప్పిన రేవంత్.. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు కృష్ణాపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Weight Loss Tips : బరువు తగ్గాలని ఈ తప్పులు చేస్తున్నారా? అయితే, కష్టమే!

కేంద్రానికి అప్పగించేది లేదు..
ఈ సందర్భంగా కృష్ణా ప్రాజెక్టులను (Krishna River) కేంద్రానికి అప్పగించేది లేదని, జలాల్లో 68శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అనుకూలమో, వ్యతిరేకమో విపక్ష నేతలు స్పష్టత ఇవ్వాలని ముఖ్యంమంత్రి కోరారు. అలాగే దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదని, తమ వైకరేంటో స్పష్టంగా బయటపెట్టాలన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు