RSP: గ్రూప్1 పరీక్ష రద్దుకు బాధ్యతగా కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి

తెలంగాణలో గ్రూప్1 పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

New Update
RSP: గ్రూప్1 పరీక్ష రద్దుకు బాధ్యతగా కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి

RSP: తెలంగాణలో గ్రూప్1 పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్‌ జనార్దన్ రెడ్డి సహా 9 మంది సభ్యులను బర్తరఫ్ చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన వందలాదిమంది నాయకులు బిఎస్పీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీఎస్పీలో చేరిన పలువురు నాయకులకు ప్రవీణ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రూప్1 పరీక్ష పత్రాలను కోట్లాది రూపాయలకు అమ్ముకున్న కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ మంత్రులంతా ఈ పరీక్షల రద్దుకు బాధ్యులవుతారని పేర్కొన్నారు. అప్పులు చేసి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న విద్యార్థుల ఉసురు కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలకు కూడా తగులుతుందని విమర్శించారు. హైకోర్టు నిర్ణయంతో గ్రూప్1 పరీక్ష రాసిన 3లక్షల 63వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని ఆర్‌ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ చేసిన వారిపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షకు హాజరైన వారి కన్నా 270 ఆన్సర్ షీట్‌లు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.

తక్షణమే గ్రూప్1 పరీక్షల నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొత్త కమిషన్ ఏర్పాటు చేసేవరకు పరీక్షలు నిర్వహించవద్దన్నారు. అలాగే గ్రూప్1 పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయల నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఈ కుంభకోణంలో మంత్రి కేటీఆర్ పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలని వ్యాఖ్యానించారు. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రోడ్లపై తిరగనివ్వద్దని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. గ్రూప్1 రాసిన అభ్యర్థులెవరూ నిరాశ చెందొవద్దని.. బీఎస్పీ ప్రభుత్వం వచ్చాక నిజాయితీగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: సీఈవో

Advertisment
Advertisment
తాజా కథనాలు