KCR Birthday: ఆయనో గొప్ప సంగీత ప్రేమికుడు.. కేసీఆర్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ 70వ బర్త్ డే ఈరోజు. కేసీఆర్ అంటే అందరికి ఓ ఉద్యమ వీరుడిగానే ముందుగా కనిపిస్తారు. అయితే ఆయన గురించి చాలామంది తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Trinath 17 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KCR 70th Birthday: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ(ఫిబ్రవరి 17) హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నాయకులు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. నగరంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులకు వీల్‌చైర్ల పంపిణీ, ఆటో డ్రైవర్లకు బీమా పత్రాలు, రోగులకు పండ్లు పంపిణీ లాంటి సామాజిక సేవా కార్యక్రమాలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేపట్టనున్నారు. కేసీఆర్ రాజకీయ ఎదుగుదల, ఉద్యమంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నారు. ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల సమక్షంలో 70 కిలోల భారీ కేక్‌ను కట్ చేయనున్నారు. ఇక ఇవాళ కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. ➼ కేసీఆర్ ఉమ్మడి ఏపీలో 1997 నుంచి 1999 వరకు రవాణా మంత్రిగా ఉన్నారు. ➼ ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా కేసీఆర్ పనిచేశారు. ➼ కేసీఆర్ గొప్ప సంగీత ప్రేమికుడు. ➼ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనేక పాటలు రాశారు. ➼ కేసీఆర్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ➼ దక్షిణ భారతదేశంలో జాతీయ భాష హిందీలో అనర్గళంగా మాట్లాడగల మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ➼ గతంలో హిందీ మాట్లాడింది మర్రి చన్నారెడ్డి మాత్రమే. ➼ హైదరాబాద్-ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల నుంచి తెలుగు సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. ➼ కేసీఆర్ తనను తాను సూపర్ ఫార్మర్‌గా భావించుకుంటారు. ఆయనకు 60 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ➼ కేసీఆర్ ప్రధానంగా క్యాప్సికం, బంగాళదుంప పంటలను ఈ భూమిలో పండిస్తారు. Also Read: టీమిండియాకు భారీ షాక్.. సడన్‌గా టీమ్‌ని వీడిన అశ్విన్.. ఎందుకంటే? WATCH: #brs #kcr #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి