/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLC-KAVITHA-jpg.webp)
Kavitha : కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) లిక్కర్ కేసు నేడు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా (Kaveri Baweja) ఈరోజు ఈ కేసును విచారణను జరపనున్నారు. సీబీఐ (CBI) కేసులో కవిత పై దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంతో పాటు, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
లిక్కర్ కేసులో కవిత ఇన్వాల్‌మెంట్ గురించి సీబీఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశం పై శుక్రవారం విచారణ జరపనుంది. గురువారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవెజా ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 8న ట్రయల్ కోర్టు లో కవిత సీబీఐ కేసు విచారణ జరిగిన విషయం తెలిసిందే.
లిక్కర్ కేసు (Liquor Case) లో కవిత సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరుపు న్యాయవాది కోర్టును కోరిన విషయం తెలిసిందే. వాదనలు విన్న జడ్జి కావేరి బవెజా శుక్రవారానికి కవిత తరుపు న్యాయవాది కోర్టును కోరారు. మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also read: జాక్వెలిన్ కు జైలు నుంచే ప్రేమలేఖ రాసిన సుకేశ్…100 మందికి ఆ బహుమతులు ఇస్తాడంట!