Corona: ఇక పై మాస్క్‌ తప్పనిసరి.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజల్లో భయం భయం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించింది.

New Update
Covid 19 : మళ్లీ మాస్కులు రాబోతున్నాయా..? అవుననే అంటోంది వైద్యశాఖ!

దేశాన్ని వదిలిపోయిందనుకున్న మహమ్మారి మరోసారి తన విశ్వరూపం చూపించడానికి వచ్చేసింది. గత కొద్ది రోజులుగా కేరళ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. కేరళలో కేసులు పెరుగుతుండడంతో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం అప్రమత్తం అయ్యింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్‌ గుండూరావు ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. మరీ ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, చిన్న పిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు.

కొడుగులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఇప్పటికే దీని గురించి ఓ సమావేశం నిర్వహించం. ఆ సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చించాం.గుండె సమస్యలున్నావారు, 60 సంవత్సరాలు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులను కూడా సిద్దంగా ఉండాలని తెలిపాం. కేరళతో సరిహద్దులు పంచుకునే ప్రాంతాల వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మంగళూరు, చామనాజ్‌ నగర్‌, కొడగులు ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలి. టెస్ట్‌ చేసేందుకు పరీక్షలను పెంచుతాం. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తప్పని సరిగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మరోసారి దేశంలో కరోనా డేంజర్‌ బేల్స్‌ మోగుతున్నాయి. రోజురోజుకి ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో మరోసారి వైద్యశాఖ అప్రమత్తం అవుతోంది. దేశంలో ఒక్కరోజే సుమారు 335 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరోజులోనే ఐదుగురు మృతి చెందారు. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వైద్యశాఖాధికారులను అలర్ట్‌ చేసింది.

ఇటీవల కోవిడ్-19 కేసులు పెరగడం, భారత్‌లో జేఎన్.1 వేరియంట్ తొలి కేసును గుర్తించడంతో రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. కోవిడ్ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. రాష్ట్రాల వారీగా ఎస్ఏఆర్ఐ, ఐఎల్ఐ కేసులను ఎప్పటికప్పుడు రిపోర్టు చేసి పర్యవేక్షించాలని చెప్పింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.

Also read: సజ్జనార్ గారు .. యువకులపై కాదు.. నాగార్జున పై చూపండి మీ ప్రతాపం!

Advertisment
Advertisment
తాజా కథనాలు