Bengalore: ఆరేళ్లలో ఏడు పెళ్లిళ్లు..కోర్టు ఏం చెప్పిందంటే!

కర్నాటకకు చెందిన ఓ మహిళ ఆరేళ్లలో ఏకంగా ఆరుగురు భర్తలను మార్చింది. ఇటీవల ఏడో పెళ్లి కూడా చేసుకుంది. అంతటితో ఆగకుండా ఏడో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. డబ్బుల కోసమే ఆమె ఇలా చేస్తోందని ఏడో భర్త కోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు ఆ మహిళను మందలించింది.

New Update
Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!

Karnataka: తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కర్ణాటక లో ఓ మహిళ (32) కోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం ఆమె మీదే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే  ఆ మహిళ కేవలం డబ్బు కోసమే శ్రీమంతులను చూసి పెళ్లి చేసుకోవడం..తరువాత ఏదోక సాకు చెప్పి విడాకులు తీసుకుటుండడంతో సదరు మహిళ బాధితుడైన ఏడో భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

దీంతో ఆ మహిళ బాగోతం బయటకు వచ్చింది. ఇలా ఆరు సంవత్సరాలలో ఆరుగురు భర్తలను మార్చిన ఆమె..వివాహం అయిన ఆరు నెలల తరువాత భర్త..అత్తింటి తరుఫున వారు వేధిస్తున్నారంటూ వారి మీద గృహహింస కేసులు పెట్టేది. దీంతో సదరు భర్తల కుటుంబాల వారు రాజీకి వచ్చి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి ఆమెను వదిలించుకునేవారు.

ఇలా తాజాగా ఆ మహిళ ఏడో భర్త పై కేసు పెట్టింది. దీంతో కోర్టు ఆ మహిళ తీరును న్యాయమూర్తి సోమవారం ఖండించారు. ఆరుగురు భర్తల్లో ఒక్కరితో కూడా ఎక్కువ రోజులు ఉండకపోవడం అంటే మహిళ తప్పే కనిపిస్తోందని ఆమెకు మొట్టికాయలు వేసింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.

Also read: అమెరికా మహిళను అడవిలో గొలుసుతో కట్టేసి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు