Karnataka: నీట్ రద్దుకు తీర్మానం..కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

కర్ణాటకలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసేవిధంగా ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో ఎంట్రన్స్ పరీక్ష జరపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

New Update
Karnataka: నీట్ రద్దుకు తీర్మానం..కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

NEET Exam Cancel: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా డాక్టర్ కోర్స్ ప్రవేశాల కోసం జరిపే నీట్ ఎగ్జామ్స్‌ను రద్దు చేయాలని సిద్ధ రామయ్య ప్రభుత్వం తీర్మానించింది. దీనికి కేబినెట్ ఆమోదం కూా తెలిపింది. నీట్ స్థానంలో మరో మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించడం లేదా, కామన్‌ ఎంట్రన్‌ టెస్ట్‌ తో పరీక్ష జరపాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో సమాేశమైన మంత్రి వర్గం ఈ నిర్యం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లు కర్ణాటక విధాన సభ ముందుకు త్వరలోనే రానుంది. గతంలో లాగానే ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా, సొంతంగా ప్రవేశాలు చేపట్టేలా రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

రీసెంట్‌గా నీట్ పరీక్షలో అక్రాలు, ఫలితాల్లో అవకతవకలు దేశం మత్తంలో కల్లోల రేపాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. తాజాగా గ్రేస్ మార్కులు వేసిన పలువురికి రీ ఎగ్జామ్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ రద్దు తీర్మానం చేసిందని తెలుస్తోంది. మెడికల్‌ ప్రవేశాల కోసం కొత్తగా తీసుకొచ్చిన బిల్లు అసెంబ్లీలో పాస్‌ అయితే యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పరీక్ష పెట్టే అవకాశం ఉంది. గత నెల తమిళనాడు ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు సొంతంగా వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిఇవ్వాలని పేర్కొంది. దీనికి పలు స్థానిక పార్టీలు మద్దతు ఇచ్చాయి.

Also Read:Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్…విశేషాలు ఇవే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment