Karnataka : రాత్రి నిద్ర పట్టాలంటే.. ఓ పెగ్ ఎక్స్‌ట్రా వేసుకోండంటూ మహిళా మంత్రికి కర్ణాటక మంత్రి సలహా! కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బల్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసిహెబ్బల్కర్ ఆందోళనకు గురవుతున్నారని, ఆమెకు నిద్ర పట్టడం లేదని అన్నారు. By Bhavana 15 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sleeping Problem : రాత్రి బాగా నిద్రపోవడానికి(Night Sleep) ఓ పెగ్ తీసుకోడంటూ కర్ణాటక(Karnataka) బీజేపీ(BJP) నేత సంజయ్ పాటిల్(Sanjay Patil) కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్(Lakshmi Hebbalkar) కి సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత వివాదాస్పదంగా మారాయి. బీజేపీ నేత సంజయ్ మంత్రి హెబ్బాల్కర్‌ను హేళన చేస్తూ, కర్ణాటకలో బీజేపీ పెరుగుదల హెబ్బాల్కర్‌ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని, రాత్రి బాగా నిద్రపోవడానికి నిద్ర మాత్ర లేదా అదనపు పెగ్ తీసుకోవాలని సూచించారు. “నేను కర్ణాటకలోని ఎనిమిది ప్రాంతాలకు ఇన్‌చార్జిగా పనిచేశాను. బెలగావిలో పెద్ద సంఖ్యలో మహిళలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు అందుకే మా అక్క (లక్ష్మీ హెబ్బాల్కర్) నిద్రపోయేందుకు నిద్రమాత్రలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. లేదా మంచిగా నిద్రపోవడానికి ఓ ఎక్స్‌ట్రా పెగ్ కూడా తీసుకుంటే ఇంకా మంచింది” అని శనివారం బెలగావిలో జరిగిన సభలో పాటిల్ అన్నారు. లక్ష్మీ హెబ్బాల్కర్‌పై చేసిన వ్యాఖ్యల ద్వారా సంజయ్ పాటిల్ మొత్తం మహిళా సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానించారని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ లో మహిళా వ్యతిరేక వైఖరి పెరుగుతోందని కూడా కాంగ్రెస్(Congress) ఆరోపించింది.“మహిళలను ఎవరు చిన్నచూపు చూస్తున్నారో వారికి పతనం మొదలైందని.. బీజేపీ, జేడీఎస్ పార్టీల పతనం మొదలైందని.. అందుకే వారిలో మహిళా వ్యతిరేక ధోరణి పెరుగుతోందని.. కౌరవులు, రావణుడిలాగా బీజేపీ, జేడీఎస్‌లు సర్వనాశనం కావడం ఖాయమని కర్ణాటక కాంగ్రెస్ గతంలో ఓ పోస్టులో తెలిపింది. ముఖ్యంగా, హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌పై బెలగావి స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. Also read: టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం! #congress #bjp #karnataka #sanjay-patil #lakshmi-hebbalkar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి