Hookah : ఆ రాష్ట్రంలో హుక్కాపై నిషేధం.. ఈ కారణంతోనే నిర్ణయం.. కర్ణాటకలో హుక్కా తాగడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలోని ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని... ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రకటన చేశారు. హుక్కాపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. By B Aravind 08 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ban Hookah : కర్ణాటక(Karnataka) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ హుక్కా(Hookah) పై ఉక్కుపాదం మోపేందుకు చర్యలకు ఉపక్రమించింది. హుక్కా విక్రయించడం, తాగడంపై తాజాగా నిషేధం విధించింది. రాష్ట్రంలోని ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని... కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రకటన చేశారు. రాష్ట్రంలో హుక్కాపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. Also Read : రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం.. గవర్నర్ తమిళసై సంచలన వ్యాఖ్యలు ఆరోగ్యంపై చెడు ప్రభావం హుక్కా తాగడం వల్ల ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపుతోందని అన్నారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా హుక్కాను తాము నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన, మెరుగైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ముఖ్యంగా యువతు హుక్కాబార్లకు ఆకర్షితులైపోతున్నారని.. దీనివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. గతేడాది హుక్కా బార్లు నిషేధం ఇదిలా ఉండగా.. పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారడటంతో కర్ణాటకలో ఆందోళన వ్యక్తం కావడంతో.. 2023 సెప్టెంబర్‌కు ప్రభుత్వం హుక్కా బార్లను నిషేధించింది. అంతేకాదు పొగకు ఉత్పత్తులు కొనాలంటే వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు అక్కడ ఇదే అమలవుతోంది. మరోవైపు ఆలయాలు, మసీదులు, శిశుసంరక్షణ కేంద్రాలు, దవాఖానాల చుట్టు పొగకు వాడకాన్ని అలాగే వాటి విక్రయాలను కర్ణాటక సర్కార్ ఇప్పటికే నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read: మోడీ పదేళ్ళ పాలన మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. #telugu-news #national-news #hookah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి