Karimnagar : కరీంనగర్‌లో ఉద్రిక్తత.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు

కరీనంగర్‌లో శనివారం నిర్వహించిన హనుమాన్‌ భక్తుల శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే హనుమాన్ భక్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురు స్వాములపై కేసు నమోదైంది.

New Update
Karimnagar : కరీంనగర్‌లో ఉద్రిక్తత.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు

Police Filed Case On Hanuman Devotees : కరీనంగర్‌ (Karimnagar) లో శనివారం నిర్వహించిన హనుమాన్‌ భక్తుల (Hanuman Devotees) శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించాడు. స్వాములపై దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో హనుమాన్‌ భక్తులు ఆ యువకుడిని అడ్డుకున్నారు. దీంతో అతడికి, హనుమాన్‌ భక్తుల మధ్య కాసేపు ఘర్షణకు దారి తీసింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also read: బీఆర్‌ఎస్ కోట్లు పెట్టి ఓటర్లను కొంటోంది.. రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు..

పోలీస్‌ వాహనం (Police Vehicle) లో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు యత్నించగా.. హనుమాన్‌ భక్తులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసుల తీరుపై వాళ్లు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారీ తీశాయి. ఆందోళన చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే హనుమాన్‌ శోభయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తిని పోలీసులు జయదేవ్‌గా గుర్తించారు. అతను బీజేపీ (BJP) నేత సత్యనారాయణకు అనుచరుడని.. బీజేపీ కార్యకర్త అని తేలింది. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు హనుమాన్‌ భక్తులపై కేసు నమోదైంది. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: కేటీఆర్ సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు