సిక్స్ ప్యాక్ ఉంటే చాలదు.. అది కూడా ఉండాలి: హీరోల పరువు తీసేసిన కరీన నటి కరీనా కపూర్ స్టార్ హీరోల ఫిట్ నెస్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య కాలంలో బట్టలిప్పి బాడీ చూపించడం అందరికీ కామన్ అయిపోయిందని, సిక్స్ ప్యాక్ కాస్త కనిపిస్తే చాలు తెగ షోలు చేస్తున్నారంటూ పరువు తీసింది. అబ్స్ ఉంటే స్టార్ అయిపోయినట్లు కాదని చెప్పింది. By srinivas 19 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ స్టార్ హీరోల ఫిట్ నెస్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఈ మధ్య కాలంలో బట్టలిప్పి బాడీ చూపించడం అందరికీ కామన్ అయిపోయిందని, సిక్స్ ప్యాక్ కాస్త కనిపిస్తే చాలు తెగ షోలు చేస్తున్నారంటూ పరువు తీసింది. అంతేకాదు కొంతమందిని చూస్తే తనకు అసహ్యంగా కూడా అనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్ అనుభాలపై మాట్లాడింది. 'హీరోలకు సిక్స్ ప్యాక్ అబ్స్ ఉన్నంత మాత్రాన పెద్ద స్టార్ అయిపోయామనుకుంటే పొరపాటే. దాంతోపాటు టాలెంట్ ఉండాలి. ఒక్కోసారి కొందరినీ చూస్తే షర్ట్ వేసుకో.. చూడలేకపోతున్నా అని చెప్పాలనిపిస్తుంది. మీరు గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తులైతే, ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తే, స్టార్ డమ్ దానికదే వస్తుంది. అతనికి సిక్స్ ప్యాక్ అబ్స్ ఉన్నాయి.. అతడు చాలా హాట్.. అతడో పెద్ద స్టార్ అని ఏమీ ఉండదు. ఒక్కోసారి అలాంటి నటుల దగ్గరికి వెళ్లి నేను నిలబడలేకపోతున్నా' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఒకప్పుడు తన తాత రాజ్ కపూర్, అంకుల్ రిషీ కపూర్, నాన్న రణ్‌ధీర్ కపూర్ సినిమాలు చేసే సమయానికి ఇప్పటికీ చాలా మారిపోయిందని కరీనా చెప్పింది. మంచి నటులైతే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారని ఆమె తెలిపింది. ఇది కూడా చదవండి : ‘యానిమల్’ నుంచి బోల్డ్ సాంగ్ ఫుల్ వీడియో.. పిచ్చెక్కించిన త్రిప్తి అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందనే విషయంపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్ లో 'జానే జాన్' అనే మూవీ చేసిన కరీనా కపూర్ ఫిల్మ్ కాంపానియన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా ఘాటు కామెంట్స్ చేసింది. ఈ మూవీలో ఆమె పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. #kareena-kapoor #heroes #six-packs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి