Warangal : వరంగల్‌లో వ్యక్తి ప్రాణం తీసిన చిట్టీలు

వరంగల్‌లో కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో ఏఎమ్జీ గా పని చేస్తున్న భాస్కర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తాను మంచి చేద్దామని చూస్తే చివరకు తనకు చావే మిగిలిందని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయారు. పై అధికారులే తన చావుకు కారణమని, వాళ్ళని శిక్షించాలని కోరారు.

New Update
Warangal : వరంగల్‌లో వ్యక్తి ప్రాణం తీసిన చిట్టీలు

Kanaka Durga Chits AMG Suicide : అతనొక చిట్ ఫండ్ కంపెనీ(Chit Fund Company) ఉద్యోగి. తన పని సిన్సియర్ గా చేసుకుని వెళ్ళిపోయే రకం. ఉద్యోగ ధర్మంలో భాగంగా కంపెనీలో కోట్ల రూపాయలు డిపాజిట్లు చేయించారు. కానీ పై అధికారుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వరంగల్(Warangal) కనకదుర్గ చిట్ ఫండ్స్‌(Kanaka Durga Chit Funds) లో AMGగా పని చేసిన భాస్కర్ రెడ్డి(Bhasker Reddy) కథ ఇది. ఇతను ఆత్మహత్య(Suicide) చేసుకుని చనిపోయారు. చనిపోతూ తన చావుకు కారణం వారిద్దరే అంటూ అంటూ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నారు.

Also Read : Andhra Pradesh : గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం..రెండు బిల్లుల ఆమోదం.

సూపైడ్ నోట్ రాసిన భాస్కర్‌రెడ్డి..

భాస్కర్‌రెడ్డి నోట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. "నా చావుకు కారణం చిట్‌ఫండ్ ఛైర్మన్ తిరుపతిరెడ్డి(Tirupati Reddy), ఎండీ కమలాకర్‌రెడ్డి(Kamalakar Reddy) లే స్పష్టంగా రాశారు భాస్కర్రెడ్డి. కోట్లరూపాయలు డిపాజిట్ చేయించానని..కస్టమర్లకు డబ్బులు ఇవ్వకుండా ల్యాండ్‌ ఇస్తామని ఓనర్లు అంటున్నారు. కానీ కస్టమర్లు ఒప్పుకోవడంలేదని చెప్పారు. డబ్బులిప్పించమని కస్టమర్లు నా వెంట పడుతున్నారు. ఇద్దరూ నా మాట వినడం లేదు. ఓనర్లు, కస్టమర్ల మధ్య నలిగిపోయా. ఇంక నా వల్ల కాదు, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ నోట్ లో రాసారు భాస్కర్‌రెడ్డి. కస్టమర్లకు న్యాయం చేయండి, నేను చనిపోతున్నాని చెప్పారు.

ఛైర్మన్, ఎండీ అరెస్ట్...

భాస్కర్‌రెడ్డి సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనకదుర్గ చిట్‌ఫండ్ ఛైర్మన్, ఎండీని అరెస్ట్ చేశారు. దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Also Read : BREAKING: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. హస్తం పార్టీలోకి పెద్దపల్లి ఎంపీ ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment