Konaseema Arson Case: మంత్రి విశ్వరూప్ తనయుడికి నిరసన సెగ.. అల్లర్లలో అన్యాయంగా ఇరికించారని ఆగ్రహం!!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్‌ కుమారుడిపై తిరగబడ్డారు అమలాపురం కేసుల్లో ఉన్న స్థానికులు. మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై దాడికి యత్నించారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి? అని స్థానికులు విశ్వరూప్ పై విరుచుకు పడ్డారు. తండ్రి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్టు చేయించారు.. అధికారం ఉంది కదా అని అమాయకులను ఇరికిస్తే చూస్తూ ఊరుకోమంటూ స్థానిక మహిళలు, యువత శ్రీకాంత్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.

New Update
Konaseema Arson Case: మంత్రి విశ్వరూప్ తనయుడికి నిరసన సెగ.. అల్లర్లలో అన్యాయంగా ఇరికించారని ఆగ్రహం!!

Kamanagaruvu Residents fires on Minister Viswarup Son Srikanth: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్‌ కుమారుడిపై తిరగబడ్డారు అమలాపురం కేసుల్లో ఉన్న స్థానికులు. మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై దాడికి యత్నించారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి? అని స్థానికులు విశ్వరూప్ పై విరుచుకు పడ్డారు. తండ్రి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్టు చేయించారు.. అధికారం ఉంది కదా అని అమాయకులను ఇరికిస్తే చూస్తూ ఊరుకోమంటూ స్థానిక మహిళలు, యువత శ్రీకాంత్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.

తమ బిడ్డలను అక్రమంగా జైలులో పెట్టించారని కన్నీరు పెట్టుకున్న బాధితులు:

తమ బిడ్డలను మూడు నెలల పాటు జైలులో పెట్టించారని బాధితుల తల్లితండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. మీ ఇంటి దహనాలతో మాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగి డపగడపకు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. శ్రీకాంత్ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. తాను ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించేందుకే వచ్చానని.. తనను అర్ధం చేసుకోవాలని శ్రీకాంత్ స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో చేసేది ఏమి లేక మంత్రి కుమారుడు వెనుదిరిగాడు.

గత ఏడాదిలో దహనమైన ఏపీ మంత్రి విశ్వరూప్ నివాసం:

కాగా గత ఏడాది జిల్లా పేరు విషయంలో అమలాపురం అల్లర్ల సమయంలో మంత్రి విశ్వరూప్ నివాసం దహనం అయింది. ఈ ఘటనలో నిందితులు అంటూ కామగరువు గ్రామానికి చెందిన కొందరి యువకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది గ్రామస్తులు మూడు నెలలు జైలు జీవితం గడిపారు. అప్పటి నుంచి నిందితులు, బాధితుల కుటుంబ సభ్యలు మంత్రి విశ్వరూప్‌ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మంత్రిపై ఆరోపణలు చేయడానికి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు గ్రామస్థులు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి తనయుడిని.. మంత్రి ఇంటి దహనంతో తమకేం సంబంధమంటూ బాధితులు నిలదీశారు.

ఇవి కూడా చదవండి:

TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్

సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో.. Aditya L1 Mission ప్రయోగానికి అంతా సెట్

IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు

Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు