USA: కమలా హారిస్ యాస పై ట్రంప్ బృందం ట్రోలింగ్..ప్రచారంలో కొత్త అస్త్రం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కమలా హారిస్, ట్రంప్ తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో లేబర్ డే సందర్భంగా కమలా హారిస్ మాట్లాడిన తీరు మీద ట్రంప్ బృందం ట్రోల్ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో మాట్లాడారంటూ కొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. By Manogna alamuru 04 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kamala Harris: ఎన్నికల ప్రచారం అంటే ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం...తమ గురించి గొప్పలు చెప్పుకోవడం. ఏ దేశంలో అయినా ఇదే తంతు నడుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో కూడా ఇదే జరుగుతోంది. నువ్వా–నేనా అన్నట్టు నువ్వా-నేనా అన్నట్లు మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.కమలా హారిస్ తన ప్రచారాన్ని ఈ మధ్యనే మొదలెట్టారు కానీ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తూ జోరు మీద ఉన్నారు. తాజాగా లేబర్ డే నాడు మిషిగన్‌లో డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ తన ప్రచారాన్ని నిర్వహించారు. అక్కడ ఒక స్కూల్‌లో మాట్లాడుతూ ఐదు రోజులు పని, రెండు రోజులు సెలవు, సిక్ లీవ్ ఇలా అన్నీ ఇస్తున్నందుకు యూనియన్ మెంబర్స్‌కు కృతజ్ఞతలు తెలపాలని కమలా అన్నారు. అక్కడ లేబర్ డే ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఇప్పుడు దీనిపై ట్రంప్ బృందం ట్రోలింగ్ ప్రారంభించింది. హారిస్ మాట్లాడిన యాస మీద విమర్శలు చేస్తున్నారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే నకిలీ యాసతో మాట్లాడారని ట్రంప్ ప్రచారం బృందం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తోంది. కొంతమంది లూనీ ట్యూన్స్ పాత్ర అయిన ఫోఘోర్న్ లెఘోర్న్‌తో ఆమె యాసను పోల్చుతున్నారు. అయితే కమలా హారిస్ తన యాస మీద విమర్శలు ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు.అంతకు ముందు 2021లో అట్లాంటాలో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లానిప్పుడు కూడా ఇలాగే ట్రోల్ చేశారు. అప్పుడు ఏకంగా ఆమె ఫ్రెంచ్ యాసలో మాట్లాడారని ఆరోపణలు చేశారు. She’s turned into Foghorn Leghorn pic.twitter.com/Z1OgJwh6Ht pic.twitter.com/xdXmiAYvEK — mjcmedic (@mjcmedic) September 2, 2024 ట్రంప్ , అతని బృందం మొదటి నుంచి కమలా హారిస్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూనే ఉన్నారు. జాత్యాంహాకార విమర్శలు కూడా చాలాసార్లు చేశారు. ఆమె మాటల, నవ్వు ఇలా ఒకటేమిటి.. అన్నింటి మీద ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. కమలా తండ్రి జమైకన్, తల్లి ఇండియన్ కావడమే ఇందుకు కారణం. Also Read: Telangana: టైమ్ రిస్ట్రిక్షన్ పెట్టకండి..స్విగ్గీ, జొమాటో వర్కర్స్ అసోసియేషన్ #election-campaign #usa #kamala-harris #trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి