Movies: కల్కి కథేంటో తెలిసిపోయింది..గ్రాండ్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కల్కి 2898 ఏడీ సినిమా మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అని చెప్పారు. ముంబయ్‌లో కల్కి సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ పాల్గొన్నారు. By Manogna alamuru 19 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ముంబయి లో ప్రభాస్ కల్కి మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మరో వారం రోజుల్లో జూన్ 27న మూవీ రిలీజ్ అవనుంది. ప్రభాస్ హీరోగా దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హసన్ ప్రధాన పాత్రల్లో కల్కి మూవీ రూపొందింది. ఇది రెండు భాగాలుగా రానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటూ నటులు అందరూ మాట్లాడారు. కల్కి లో నేను పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్ అన్నారు అమితాబ్ బచ్చన్.కల్కి ఎక్స్పీరియన్స్ ను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.డైరెక్టర్ నాగ అశ్విన్ కల్కి ని అద్భుతంగా తీశాడని పొగడ్తలతో ముంచేశారు విశ్వనాయకుడు కమల్ హసన్. అమితాబ్ సర్, కమల్ సర్ లాంటి గ్రేట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం ఇట్స్ బిగ్గర్ దేన్ డ్రిమ్ అంటూ మురిసిపోయారు ప్రభాస్.కల్కి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని కంప్లిట్ న్యూ వరల్డ్ అని చెప్పారు ఇందులో కీలకపాత్రలో నటించిన దీపికా పడుకోన్. ఇక కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... ఇదో మూడు ప్రపంచాల మధ్య సాగే కథ అని చెప్పుకొచ్చారు. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ప్రపంచాలు ఇందులో ఉంటాయి అని చెప్పారు. చరిత్రలో కాశీ మొదటి నగరమని చెప్తారు. అలాంటి కాశీనే చివరి నగరం అయితే ఎలా ఉంటుందో అన్న ఊహతో కల్కి తీశామన్నారు. మనుషులు బతకడానికి అవసరమైన వనరుల కోసం ఇక్కడి ప్రజలు నిత్యం పోరాటం చేస్తుంటారు. మరోవైపు గంగానది కూడా ఎండిపోయి కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర మేర ఉండే ఇక్కడ లభించని వస్తువు, పదార్థమంటూ ఉండదు. స్వర్గలోకంలా ఉంటుంది. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది. కాశీలో ఉండే ప్రజలు కాంప్లెక్స్‌కు వెళ్ళాలనుకోవడమే మూవీ కథ. దీనికోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతుంటారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రపంచం ఉంటుంది అది శంబాలా. టిబెటిన్ కల్చర్‌లో దీన్ని షాంగ్రిలా అని అంటారు. ప్రతి సంస్కృతిలో ఒక రహస్య ప్రపంచం దాగి ఉంటుంది. దాన్నే కొందరు ఆధునిక ప్రపంచం లేదా అవతార్ లోకం అంటారు. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచే విష్ణు చివరి అవతారం వస్తుంది. ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ కల్కి కథ నడుస్తుంది అంటూ మొత్తం సినిమా కథను క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే సినిమా మొత్తం విజువల్ వండర్‌గా ఉంటుందని..సినిమా మొత్తం జాతులు, శరణార్ధులు, కాంప్లెక్స్ సభ్యులు ఇలా..ఒకరితో ఒకరు పోరాటాలు చేసుకుంటూ ఉంటారు. వీటి కోసం కొత్త ఆయుధాలు, వాహనాలు లాంటివి దిజైన్ చేశాము. అవన్నీ చూసి తీరాల్సిందే అని చెప్పారు నాగ్ అశ్విన్. #kalki-2898-ad #movies #pre-release-events మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి