Kakinada : కారు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ.. విశ్రాంత జడ్జి మృతి!

కాకినాడ జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జితో పాటు మరో ఇద్దరు చనిపోయారు.విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ను వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Kakinada : కారు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ.. విశ్రాంత జడ్జి మృతి!

Kakinada Road Accident : కాకినాడ జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి (National Highway) వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జితో సహా ఇద్దరు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ను వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు (Private Travels Bus) అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

బస్సు వేగంగా ఢీకొట్టడంతో ఆ ధాటికి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాను మీదకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న రిటైర్డ్‌ జడ్జి (Retired Judge) మోహన్‌ కుమార్‌ (Mohan Kumar) అక్కడికక్కడే మృతి చెందారు..ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ శ్రీను తీవ్ర గాయాలతో ఉండగా అతడిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also read: కల్వర్టును ఢీకొన్న కారు.. నలుగురు అక్కడిక్కడే మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తిరుమలలో నిలువు దోపిడీ.. తలనీలాలకు రూ.100.. వీడియో ఇదిగో!

తిరుమలలో శ్రీవారికి కొందరు తలనీలాలు సమర్పించే దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు. అంతా ఉచితమే. కానీ కొందరు క్షురకులు తిరుమల కళ్యాణకట్టలో భక్తుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

New Update
Tirumala kalyana katta

Tirumala kalyana katta

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాది అంతా భక్తులు వెళ్తుంటారు. ఏ సమయంలో వెళ్లినా కూడా భక్తులతో తిరుమల కలకలలాడుతుంది. అయితే శ్రీవారికి కొందరు తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలు సమర్పించే దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు. అంతా ఉచితమే. కానీ కొందరు క్షురకులు మాత్రం భక్తుల నుంచి లంచం తీసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

ఓ నెటిజన్ వీడియో తీసి..

తిరుమల కళ్యాణకట్టలో భక్తుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ దయచేసి దీనిపై దృష్టి పెట్టండని తెలిపారు. భక్తులు ఇష్టపూర్వకంగా డబ్బు ఇస్తే సమస్య కాదని.. భక్తులు కార్మికులకు ఎల్లప్పుడూ కూడా మద్దతు ఇస్తారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఇదిలా ఉండగా.. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో చాలామంది దైవదర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఎక్కువమంద తిరుమలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్కువమంది బస్‌లు, ట్రైన్‌లలో వెళ్తున్నప్పటికీ తిరుమతితో పాటు ఇతర ప్రాంతాలను దర్శించుకోవాలనుకునేవారు కార్లలో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

వేసవికాలం కావడంతో కార్లలో వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచిస్తున్నారు.  ఇటీవల ఎండాకాలం లో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి పలు కారణాలున్నాయి. కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు.

Advertisment
Advertisment
Advertisment