Kajal Agarwal : ఆ హీరో కోసమే ఐటెం సాంగ్ లో నటించాను.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్!

తాజాగా ఆలీతో సరదాగా పాల్గొన్న కాజల్ ను అలీ.. జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ ఎందుకు చేశారు? అని అడిగితే.." కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ ఐటెం సాంగ్ చేశానని, తారక్ తో ఎన్నో సినిమాలు చేశానని, ఆ పాట నాకు ఛాలెంజింగ్ అనిపించి అందులో నటించానని చెప్పింది.

New Update
Kajal Agarwal : ఆ హీరో కోసమే ఐటెం సాంగ్ లో నటించాను.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్!

Kajal Agarwal About Item Song In Janata Garage Movie : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ(Tollywood Film Industry)లో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకొని హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్(Kajal Agarwal). 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో వెండితెరకి హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్.. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేసి భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే 'సత్యభామ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న కాజల్ తన సినీ కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగానే 'జనతా గ్యారేజ్' మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది.

Also Read : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్డే.. షాక్ లో ఫ్యాన్స్?

ఎన్టీఆర్ కోసమే ఐటెం సాంగ్ చేశా

కాజల్ అగర్వాల్ తన కెరీర్ లో ఒకే ఒక్క ఐటెం సాంగ్(Item Song) చేసింది. అది కూడా తన కో-స్టార్ జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ ఎన్టీఆర్ తో కలిసి 'పక్కా లోకల్' సాంగ్ కి అదిరిపోయే మాస్ స్టెప్స్ వేసింది. కాజల్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే ఈ ఐటెం సాంగ్ చేసి అందరికీ షాకించ్చింది.

మాములుగా స్టార్ స్టేటస్ వచ్చి వరుస ఆఫర్స్ తో బిజీగా ఉండే హీరోయిన్స్ ఐటెం సాంగ్ చేసందుకు ఆసక్తి చూపరు. కానీ కాజల్ మాత్రం ఐటెం సాంగ్ చేసింది. తాజాగా తన షోలో పాల్గొన్న కాజల్ ను అలీ.. జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ ఎందుకు చేశారు? అని అడిగితే.." కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ ఐటెం సాంగ్ చేశానని, తారక్ తో ఎన్నో సినిమాలు చేశానని, ఆ పాట నాకు ఛాలెంజింగ్ అనిపించి అందులో నటించానని చెప్పింది. దీంతో కాజల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు