Kadiyam : కాంగ్రెస్‌లోకి కడియం కుటుంబం!

సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య. ఈ ఇద్దరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షీ. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Kadiyam : కాంగ్రెస్‌లోకి కడియం కుటుంబం!

Kadiyam Srihari : ఊహించిందే జరిగింది.. కడియం చెప్పిందే చేశారు. కాంగ్రెస్‌(Congress) లో చేరిపోయారు. తన కూతురుతో కలిసి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi) సమక్షంలో ఈ గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షీ ఈ ఇద్దరిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లి భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని కడియంను వారి ఆహ్వానించారు. అయితే కడియం వరంగల్(Warangal) ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని.. ఆ స్థానంలో తన కూతురుకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరగా కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తన డిమాండ్లకు అంగీకరించడంతో ఇవాళ కడియం కాంగ్రెస్ లో చేరారు.

తన అనుచరులు, శ్రేయోభిలాషులతో మాట్లాడిన కడియం చివరకు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతున్న వివేకం మూవీ..ఎన్నికలపై ప్రభావం చూపించనుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు