Telangana : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కడియం కావ్య..!

వరంగల్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. తాను ఎన్నికల  పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

New Update
Telangana : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కడియం కావ్య..!

Warangal : వరంగల్ లో బీఆర్ఎస్(BRS) కు బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నిక(MP Elections) ల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య(Kadiyam kavya) లేఖ రాశారు. తాను ఎన్నికల  పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో ఆమె పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న కావ్య...ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని పేర్కొన్నారు. కేసిఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు.

publive-image

కాంగ్రెస్‌లో చేరిక..

బీఆర్ఎస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత కడియం శ్రీహరి(Kadiyam Srihari), ఆయన కూతురు కడియం కావ్య హుటాహుటిన ఢిల్లీ ప్రయాణం అయ్యారని తెలుస్తోంది. వీరిద్దరూ నేడు లాంఛనంగా కాంగ్రెస్(Congress) హై కమాండ్.. సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనబడుతోంది. వరంగల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వదిలి వెళ్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి, కావ్యల నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు