KA.Paul : సీఎం రేవంత్ ని కలిసిన కేఏ పాల్.. మతలబు ఏంటి! జనవరి 30 న జరిగే ప్రపంచ శాంతి సభలకు ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. అయితే వీరి మీటింగ్ జరిగి పది రోజులు గడిచినప్పటికీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమన్నట్లు పాల్ పేర్కొన్నారు. By Bhavana 25 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి KA Paul Met CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(Ka. Paul) ఆయన నివాసం లో కలిసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) వైరల్ గా మారాయి. ముఖ్యమంత్రిని కలవడానికి గల కారణాలను ఆయన ఆర్టీవీ(RTV) ప్రతినిధికి వెల్లడించారు. జనవరి 30 న జరిగినే ప్రపంచ శాంతి సమావేశాలకు ఆయనను ఆహ్వానించినట్లు కేఏ పాల్ తెలిపారు. డిసెంబర్ 13నే రేవంత్‌ను కలిసినప్పటికీ ఈ ఫోటోలను ఈరోజు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రపంచ శాంతి మీటింగ్ లకు ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇస్తారని మేము వెయిట్ చేశాం. కానీ వారు ఇప్పటి వరకు ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చేవరకు ఫోటోలను బయటకు విడుదల చేయవద్దని నేనే చెప్పానని పాల్ పేర్కొన్నారు. కానీ ఎన్ని రోజులు గడిచినప్పటికీ కూడా పర్మిషన్ రాకపోవడంతో ఈరోజు ఫోటోలను విడుదల చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అమిత్ షా(Amit Shah) మోదీ(Modi) లను కూడా అతిథులుగా పిలిచినట్లు చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ పురుషోత్తం రూపాలా కూడా దీనికి అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా తెలంగాణలో ఉన్న అప్పులు కొంత తీరాడానికి , కాంగ్రెస్ వారు ఇచ్చిన గ్యారంటీలు నెరవేరడానికి, వేల కోట్లు ఉచితంగా డొనెషన్లు తెవడానికి, లక్షల కోట్లు ఇన్వేస్టిమెంట్లు తెవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని పాల్ పేర్కొన్నారు. వీటికి రేవంత్ ఒప్పుకున్నారు. 60 వేల మంది పీస్ వర్కర్స్, 120 దేశాల నుంచి వర్కర్స్ వస్తున్నారు.అయితే ఇంకా స్థలం ఎక్కడ అనేది తేల్చలేదు. 18నే పర్మిషన్ ఇస్తాం అన్నారు. కానీ ఈరోజు 25 వ తారీఖు అయినప్పటికీ పర్మిషన్ ఇవ్వకపోయే సరికి నేను ఫోటోలను బయటకు విడుదల చేశానని ఆయన వివరించారు. జనవరి 30 న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రేవంత్ వస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. అనంతరం ఈ విషయాన్ని కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Also read: ఈసారి పేటీఎం వంతు..ఒకేసారి 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన! #ka-paul #revanth-reddy #modi #meeting #amith-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి