Hyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇంజినీర్ జగ జ్యోతి హైదరాబాద్ లో మరో అవినీతి ఆఫీసర్ దందా బయటపడింది. మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కే.జగ జ్యోతి రూ.84వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 19 Feb 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Corrupt Officer: హైదరాబాద్ లో మరో అవినీతి ఆఫీసర్ బండారం బయటపడింది. ఇటీవలే మెట్రోపాలిటన్ డైరెక్టర్ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా మరో ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కైంది. Your browser does not support the video tag. ఇలా బండారం బయటపడింది.. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు జరపగా ఈ బండారం బయటపడింది. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కే.జగ జ్యోతి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.84వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. వెల్ఫేర్ ఆఫీసులోని ఓ వ్యవహారంలో తన సంతకం కోసం లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇది కూడా చదవండి : Telangana: లోక్‌సభ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ! కసరత్తు మొదలుపెట్టిన సీఎం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు జగ జ్యోతి ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఇక ఆధారాలు బలంగా ఉండటంతో జగ జ్యతి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. #hyderabad #acb #k-jaga-jyoti #corrupt-officer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి