Jr NTR : చిరంజీవికి ఫోన్ చేసి మరీ 'సారీ' చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని కాదని తన తాత నందమూరి తారకరామారావు పరిశ్రమకి పెద్ద అని చెప్పాడట. ఈ ఇంటర్వ్యూ చుసిన నాగార్జున చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పమని అనండంతో తారక్ చిరుకి సారీ చెప్పాడు By Anil Kumar 06 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Junior NTR Says Sorry To Chiranjeevi : తెలుగు సినీ పరిశ్రమకు దాసరి నారాయణరావు గారి తర్వాత పెద్ద దిక్కు ఎవరంటే అందరూ మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. సినిమా వాళ్లకు ఏ సమస్య వచ్చినా ప్రతీ ఒక్కరు ఆయన దగ్గరికే వెళ్తున్నారు. అలాంటిది ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని కాదని తన తాత నందమూరి తారకరామారావు పరిశ్రమకి పెద్ద అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఇదెప్పుడు జరిగిందని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. Also Read : నన్ను నెగిటివ్ చేస్తున్నారు.. అందుకే దూరమయ్యాం, ప్రవీణ్ తో బ్రేకప్ పై స్పందించిన ఫైమా! మ్యాటర్ ఏంటంటే.. సింహాద్రి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఓ యాంకర్ పరిశ్రమలో పెద్ద హీరో ఎవరు? అని అడిగేయితే.. " మా తాత నందమూరి తారకరామారావు గారే" అని చెప్పాడట. ఈ సమాధానం అప్పట్లో చాలామందికి నచ్చలేదు. చిరంజీవికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఇలా చెప్పాడని, అప్పట్లో దీనిపై ఓ రేంజ్ లో చర్చ నడిచింది. అయితే ఈ ఇంటర్వ్యూ చుసిన నాగార్జున వెంటనే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి.. నువ్వు అలా మాట్లాడకూడదు. తప్పుగా మాట్లాడావు. మన మాట తీరును బట్టి ఎంత అహంకారమో అని అనుకుంటారు. పరిశ్రమలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాలందరికీ నువ్వు గౌరవం ఇవ్వాలి. నువ్వు తెలిసి తెలియక మాట్లాడిన మాటలే రేపు నీ కెరీర్ ని డౌన్ చేస్తాయి. ముందు నువ్వు చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పు అని క్లాస్ పీకడంతో ఎన్టీఆర్ వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పాడు. తెలిసి తెలియక మాట్లాడాను. అలాంటివేవీ మనసులో పెట్టుకోవద్దు.. నన్ను క్షమించండి సార్.. అని అన్నాడట. అప్పుడెప్పుడో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. #jr-ntr #chiranjeevi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి