Jr NTR : నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న తారక్ చిన్నప్పటి వీడియో!

జూనియర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కి నిక్కర్ వేసుకొని వెళ్లడం గమనార్హం. అప్పట్లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్ కి ఎన్టీఆర్ నిక్కర్ వేసుకొని వచ్చాడు. ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

New Update
Jr NTR : నిక్కర్ వేసుకొని ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న తారక్ చిన్నప్పటి వీడియో!

Junior NTR's Childhood Video Goes Viral : జూనియర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కి నిక్కర్ వేసుకొని వెళ్లడం గమనార్హం. ఈ వీడియో ఎన్టీఆర్ (Junior NTR) చిన్నప్పుడు ఓ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు తీసింది. అప్పట్లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్ లో సీనియర్ నటి శారద పక్కన ఎన్టీఆర్ కూర్చొని ఉన్నాడు.

ఆ ఈవెంట్ కి తారక్ నిక్కర్ వేసుకొని వచ్చాడు. ఎన్టీఆర్ చిన్నప్పటి వీడియో, అందులోనూ నిక్కర్ తో కనపడటంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చుసిన నెటిజన్స్, ఫ్యాన్స్ చిన్నప్పుడు తారక్ బొద్దుగా ఎంతో ముద్దుగా ఉన్నాడని, నిక్కర్లో ఇంకా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : రవితేజను ఉద్దేశిస్తూ హరీష్ శంకర్ ట్వీట్.. ఓవర్ చెయ్యకంటూ రిప్లై ఇచ్చిన మాస్ రాజా!

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'దేవర' (Devara) సినిమాలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్నఈ మూవీ పార్ట్- 1 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటూ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2', ప్రశాంత్ నీల్ తో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు